Wriddhiman Saha: క్రికెట్ కెరీర్లో చివరి మ్యాచ్ ఆడనున్న వృద్ధిమాన్ సాహా
- భారతదేశ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒక్కడిగా వృద్ధిమాన్ సాహా గుర్తింపు.
- క్రికెట్ కెరియర్లో చివరి మ్యాచ్ ఆడనున్న వృద్ధిమాన్ సాహా.
- గత ఏడాది నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్.
- ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లో బెంగాల్ జట్టు తరపున చివరి మ్యాచ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wriddhiman Saha: భారతదేశ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడైన వృద్ధిమాన్ సాహా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలకబోతున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 ఏడో రౌండ్ తర్వాత సాహా ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడు. గత ఏడాది నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సాహా, అప్పట్లోనే ఈ రంజీ సీజన్ తన చివరిది అని తెలిపాడు. బెంగాల్ జట్టు ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లో సాలిడ్ ప్రదర్శన చేయలేకపోయింది. 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది. దీంతో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో సాహా తన చివరి మ్యాచ్‌ను ఏడో రౌండ్‌లో ఆడనున్నాడు.
Also Read: ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన తెలుగు తేజం తిలక్ వర్మ..
Also Read
ఇక సాహా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ లో 141 మ్యాచ్‌లలో 209 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 41.68 సగటుతో 7169 పరుగులు సాధించాడు. ఇందులో 14 శతకాలు, 44 అర్ధశతకాలు ఉన్నాయి. రంజీలో అతని అత్యధిక స్కోరు 203 పరుగులు నాటౌట్. ఇక సాహా అంతర్జాతీయ క్రికెట్‌లో భారీగా రాణించలేకపోయినా వికెట్ కీపింగ్‌లో మాత్రం అత్యుత్తమంగా నిలిచాడు. మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 56 ఇన్నింగ్స్‌ల్లో 1353 పరుగులు చేసాడు. ఇందులో 3 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. ఒకే టెస్ట్‌లో 10 క్యాచ్‌లు తీసిన తొలి భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా. సాహా తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నప్పటికీ, భారత క్రికెట్‌లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడిగా గుర్తుండిపోతాడు.
తాజావార్తలు
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..