TikTok Layoff: జాతీయ భద్రత దృష్ట్యా చైనీస్ వీడియో షేరింగ్ యాప్ దేశంలో నిషేధించబడి దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. ప్రజల డేటాను చైనా అధికార పార్టీకి షేర్ చేస్తుందనే ఆరోపణలపై టిక్ టాక్ ను భారత్ నిషేదించింది. ఇది జరిగిన మూడేళ్ల తర్వాత ఈ వారంలో తన మొత్తం భారతీయ ఉద్యోగులను టిక్ టాక్ తొలగించినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 6, 2023 న టిక్ టాక్ 40 మంది భారతీయ ఉద్యోగులను తొలగించినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది. తొలగించిన ఉద్యోగులకు మూడు నుంచి తొమ్మిది నెలల వరకు జీతం అందించనుందని నివేదిక తెలిపింది.
Read Also: Turkey, Syria Earthquake : 22వేలు దాటిన మృతులు.. శిథిలాల కిందే వేలమంది
టిక్ టాక్ ఇండియా విభాగంలోని ఉద్యోగులకు ఫిబ్రవరి 28 చివరి పనిదినం అని నివేదిక పేర్కొంది. జాతీయ భద్రత దృష్ట్యా ఇప్పటి వరకు 300 చైనీస్ యాప్లను భారత్ నిషేదించింది. భారత్ లో టిక్ టాక్ ను నిషేధించినప్పటి నుంచి భారతీయ ఉద్యోగుల్లో చాలా మంది దుబాయ్ తో పాటు ఇతర దేశాల్లో పని చేస్తున్నారు. టిక్ టాక్ ను భారత్ నిషేధించిన నాటికీ మన దేశం మొత్తం 200 మిలియన్లకు పైగా వినియోగదారులతో అతిపెద్ద మార్కెట్ గా ఉంది. టిక్ టాక్ దేశం వదిలి వెళ్లిపోవడంతో దాని స్థానాన్ని ఎంఎక్స్ తకటక్, జోష్, మోజ్ వంటి అనేక భారతీయ ప్లాట్ ఫామ్ లు భర్తీ చేశాయి. అంతేకాకుండా, ఇన్స్టాగ్రామ్ షార్ట్ వీడియో ప్లాట్ ఫారం రీల్స్, అలాగే యూట్యూబ్ కి చెందిన యూట్యూబ్ షార్ట్స్ కూడా భారత మార్కెట్ లో గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి.