డైనోసర్లను ఎప్పుడైన టీవీ లలో చూడటమే కానీ నిజంగా అవి ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు.. నిప్పులు కక్కుతాయని అంటారు.. అలాంటిది ఇప్పుడు డైనోసర్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఏంటి నమ్మబుద్ది కావడం లేదు కదా.. కానీ ఇది నిజం.. ఆ వీడియో గురించి వివరంగా తెలుసుకుందాం..
పాకిస్థాన్‌లోని ఓ అమ్యూజ్‌మెంట్ పార్క్ నుండి వచ్చిన కొత్త వీడియో సోషల్ మీడియా వినియోగదారులను నవ్వించేలా చేసింది.. ‘నాచ్ పంజాబన్’ అనే ప్రసిద్ధ పాటకు ‘డైనోసార్’లు డ్యాన్స్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ వీడియో ఇస్లామాబాద్‌లోని డినో వరల్డ్‌లో చిత్రీకరించబడింది. ఇంస్టాగ్రామ్ హ్యాండిల్, imjustbesti ద్వారా భాగస్వామ్యం చేయబడింది. ఇందులో పార్క్ సిబ్బంది డైనోసార్ దుస్తులు ధరించి పాటకు డ్యాన్స్ చేస్తున్నారు-ప్రేక్షకులు చుట్టుముట్టారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ‘డైనోసార్‌లు’ తలలు పైకెత్తి తోక ఊపాయి..
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్ చెయ్యకుండా ఉండలేరు.. ఆ వీడియో కాస్త సరదాగా ఉండటంతో ఆ వీడియో వైరల్ గా మారింది.. కియారా అద్వానీ, వరుణ్ ధావన్, అనిల్ కపూర్ మరియు నీతూ నటించిన జగ్‌జగ్ జీయో కోసం కరణ్ జోహార్ తన పాటను దొంగిలించాడని పాకిస్తానీ గాయకుడు అబ్రార్ ఉల్ హక్ 2022లో ఆరోపించిన తర్వాత కథ ఆలస్యంగా వచ్చిన వారి కోసం, ‘నాచ్ పంజాబన్’ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది.. ఇప్పుడు మరోసారి ఆ పాట వార్తల్లో నిలిచింది..