ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోస్ ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆలోచించేలా ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో కొందరు ఫుడ్ వ్లోగ్స్ అంటూ రెస్టారెంట్స్, హోటల్స్, రోడ్లపై దొరికే వాటిని ఎప్పటికప్పుడు కొత్త రుచులను చూపించడం ఈమధ్య పరిపాటిగా మారింది. అయితే ఇలా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే మాత్రం ఇలాంటివి కూడా తింటారా అని కూడా ఒక్కోసారి ఆలోచన కూడా వస్తుంది. ఇక తాజాగా ఓ పానీపూరి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
Also Read: Om Bheem Bush: ఓం బీమ్ బుష్ – 2 కూడా రాబోతోందా..?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఆర్టిస్ట్ తన కళాకృతిని ప్రదర్శించడం గమనించవచ్చు. ఇకపోతే లాట్ ఆర్ట్ అంటే ఎంతో నేర్పు, సృజనాత్మకత, సహనం లాంటివి చాలా అవసరం. ఇక ఈ ఆర్ట్ సంబంధించి ఎప్పటికప్పుడు అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనిస్తూనే ఉంటాం. ఈ తరహాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో ఓ యూనిక్ లాట్ ఆర్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. మామూలుగా ఈ ఆర్ట్ కేవలం కప్పు లేదా మాత్రమే చేయడానికి ఇష్టపడతారు.
Also Read: Om Bheem Bush: ఉన్నది కాసేపైనా అందాలతో కట్టిపారేసిన హీరోయిన్స్..!
కాకపోతే ఓ ఆర్టిస్ట్ ఈ ఆర్ట్ ఏకంగా పానీపూరిపై ప్రయోగించాడు. ఈ సంఘటనకి సంబంధించిన ఆర్ట్ ప్రదర్శన ప్రస్తుత వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటగా ఓ ఖాళీ పానీపూరి తీసుకొని అందులో కాఫీ లిక్విడ్ తో నింపిన తర్వాత లాట్ ఆర్టిస్ట్ పూరి పై భాగంలో పాలతో ఆకట్టుకునే డిజైన్ వేస్తాడు. ఇది చూడటానికి నిజంగా కాఫీ కప్పులో చేసిన మాదిరిగానే ఉంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారి స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వంటకానికి కపురిసినో, లాట్‌పూరి, గప్పెచినో, కాఫీపూరి, పూరిచినో అంటూ పలు రకాల పేర్లను సూచిస్తున్నారు. మరికొందరైతే ఈ ప్రీమియం పూరి అధిక ధర ఉంటుందేమో అంటూ కామెంట్ చేస్తున్నారు.