పూర్తి కామిడి ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఓం బీమ్ బుష్ రివ్యూ అన్ని వైపులా ఫుల్ పాజిటివ్ టాక్ వినపడుతోంది. ఫన్నీ ఎలిమెంట్స్ తో పట్టాలెక్కికిన ఈ సినిమా కామెడీ ట్రాక్ తో పరుగులు పెట్టింది. సినిమా దర్శకుడు హర్ష రాసుకొన్న సన్నివేశాలు వేటికి అవే బ్రహ్మండంగా వర్కవుట్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు. కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకులను సీట్లపై లేచి నవ్వేలా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హీరోలు విష్ణు, రాహుల్, ప్రియదర్శి కలిసి పండించిన వినోదం ఓ లెవెల్ లో ఉంది. అర్ధం పర్థం లేని డైలాగ్స్, లాజిక్ లేని డైలాగ్స్ కడుపుబ్బ మనల్ని నవ్విస్తాయి.
Also Read: Om Bheem Bush: ఉన్నది కాసేపైనా అందాలతో కట్టిపారేసిన హీరోయిన్స్..!
ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా.. ప్రీతీ ముకుందన్, కామక్షి భాస్కర్ల, ప్రియావడ్లమాని, ఆయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటించగా శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి, షాన్ కక్కర్, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం, వీ సెల్యులాయిడ్ బ్యానర్ పై, యువి క్రియేషన్స్ సమర్పణలో సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి సన్నీ ఎంఆర్ డీవోపీ మ్యూజిక్ ను చేపట్టగా.. రాజ్ తోట సినిమాటోగ్రఫి బాధ్యతలు చూసుకున్నారు.
Also Read: Om Bheem Bush Review: ఓం భీమ్ బుష్ రివ్యూ
దింతో సినిమాకి ప్రీమియర్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా ఎండింగ్ లో సెకండ్ పార్ట్ కి సంబంధించిన లీడ్ వదిలారు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకు ఇలా సెకండ్ పార్ట్ కి లీడ్ వదులుతున్నారు. కానీ., ఈ సినిమాకి లీడ్ వదలడం కాస్త లాజికల్ గా ఓకే అనిపిస్తుంది. దీన్నిబట్టి ఓం బీమ్ బుష్ 2 త్వరలోనే అన్నట్టుగా లాస్ట్ లో లీడ్ వదిలారు.