రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలో అనేక రకాల కొత్త వంటకాలని ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఇకపోతే దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఇష్టపడే టిఫిన్స్ లో ఇడ్లీ ముందు వరుసలో ఉంటుంది. ఇక ఇడ్లీ, సాంబార్ కాంబినేషన్ అంటే లొట్టలేసుకుంటూ తినేవారు ఎందరో. ఇడ్లీలను కేవలం సాంబార్ మాత్రమే కాకుండా కారంపొడి, అల్లం చట్నీ, పప్పుల చట్నీలు, అంతేకాకుండా నాన్ వెజ్ వంటకాలతో కూడా కలిపి వీటిని తినటానికి ఇష్టపడతారు.
Also Read: Raghunandan Rao: హరీష్ రావు గట్టు మీద నిల్చున్నాడు.. కాంగ్రెస్ లోకా లేక..?
ఇదివరకు కేవలం ఇడ్లీలను ఒక కుక్కర్లో ఉంచి వాటిని ఆవిరితో ఉడకబెట్టి తినే వాళ్ళం. ఇకపోతే ఇప్పుడు కొత్త రకాల పద్ధతులు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. కారం ఇడ్లీ, మసాలా ఇడ్లి, తవ్వా ఇడ్లీ, పన్నీరు ఇడ్లీ ఇలా అనేక రకాల పేర్లు పెట్టి వాటిని రకరకాలుగా అమ్మేస్తున్నారు. ఇక అసలు విషయం చూస్తే.. తాజాగా మరో రకమైన కొత్త ఇడ్లి ఒకటి మార్కెట్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Also Read: Manchu Lakshmi : కారులో ఆ పోజులేంటి లక్ష్మక్క.. కిల్లింగ్ లుక్ లో లేటెస్ట్ స్టిల్స్ ..
ఇక ఈ వీడియో చూస్తే.. మామూలుగా మనం ఇడ్లీలను ఒక కుక్కర్ లో పెట్టి వండుకొని తింటాము. కానీ ఇక్కడ ఇడ్లీలను కొబ్బరిచిప్పల్లో పెట్టి తయారు చేయడం వెరైటీ. టిఫిన్ బండి వద్ద జరుగుతున్న హోటల్ యజమాని ఇడ్లీలను కొబ్బరి చిప్పల్లో పెట్టి అమ్మడం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ హోటల్ బెంగళూరు నగరంలో ఉంది. బెంగళూరు నగరానికి చెందిన ఓ ఫుడ్ స్టాల్ వ్యక్తి ఇడ్లీలను ఇలా కొబ్బరి చిప్పల్లో అద్భుతంగా తయారు చేస్తూ కస్టమర్స్ కు అందిస్తూ వెరైటీ అనుభవాన్ని పంచుతున్నాడు. ముందుగా కొబ్బరి చిప్పల్లోని కొబ్బరి మొత్తం పూర్తిగా తీసివేసి దాని తర్వాత అందులో ఇడ్లీ పిండి వేసి వాటిని ఆవిరిలో ఉంచి ఇడ్లీలను చేస్తాడు. అలా ఇడ్లీలను బయటికి తీసిన తర్వాత ఇడ్లీపై నెయ్యి వేసి, ఆపై క్యారెట్ ముక్కలు ఇంకా కారంపొడి లాంటిది చల్లి కస్టమర్లకు అందిస్తున్నాడు.