అక్కినేని వారసుడు అయిన అఖిల్ ను హీరో గా లాంచ్ చేసిన దర్శకుడు వి.వి.వినాయక్. అంతకు ముందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను ‘అల్లుడు శీను’ చిత్రం తో లాంచ్ చేసిన వినాయక్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా..బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మంచి మార్కెట్ ను కూడా ఏర్పడేలా చేశాడు అని చెప్పవచ్చు.. దీంతో అఖిల్ లాంచింగ్ కు వినాయక్ మంచి ఛాయిస్ అని నాగార్జున భావించి ఆ బాధ్యత వినాయక్ చేతిలో పెట్టారు. ఆ విధముగా ‘అఖిల్’ అనే సినిమా వీరి కాంబినేషన్లో రావడం అయితే జరిగింది.కానీ భారీ అంచనాల తో విడుదలైన అఖిల్ సినిమా అంచనాలను అందుకోలేదు. కానీ అఖిల్ సినిమాల్లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి పోయింది.అలాగే అఖిల్ మంచి డాన్సర్ గా , ఫైటర్ గా ప్రూవ్ చేసుకున్నాడు..
అఖిల్ కు మంచి లాంచింగ్ ఇవ్వడంలో వినాయక్ ఫెయిల్ అయితే అవ్వలేదు.. అతనికి సక్సెస్ ఇవ్వడం లో మాత్రం ఫెయిల్ అయ్యాడు అని చెప్పవచ్చు.. అయితే వినాయక్ – అఖిల్ మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.ఇప్పుడు ఇద్దరికీ మంచి హిట్ కావాలి. ఈ ఏడాది అఖిల్ నుండి వచ్చిన ‘ఏజెంట్’ సినిమా వినాయక్ నుండి వచ్చింది ‘ఛత్రపతి'(హిందీ) సినిమా అనుకున్న ఫలితాలు అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం అఖిల్ ఓ కొత్త డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నాడని సమాచారం.. అదే విధంగా వినాయక్ తో వర్క్ చేయడానికి కూడా అఖిల్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు. కథ మరియు స్క్రీన్ ప్లే ఓ టాప్ రైటర్ అందించబోతున్నట్టు సమాచారం.వినాయక్ దర్శకత్వం మాత్రమే చేస్తారని సమాచారం.మరీ ఈ సారి అయిన ఈ ఇద్దరికీ మంచి హిట్ లభిస్తుందో లేదో చూడాలి.