Vijayawada Road Accident: ఇద్దరి ప్రాణాలు బలిగొన్న కొబ్బరి బొండం
- ఇద్దరి ప్రాణాలు బలిగొన్న కొబ్బరిబొండం..
- జక్కంపూడి సమీపంలో వెస్ట్ బైపాస్ పై ఘోర రోడ్డు ప్రమాదం..
- కార్ క్లచ్ , బ్రేక్ మద్యలో కొబ్బరిబొండం ఇరుక్కోవడంతో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Road Accident: విజయవాడ సమీపంలోని జక్కంపూడి వద్ద వెస్ట్ బైపాస్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లో కుమారుడి వివాహానికి హాజరై రాజమండ్రికి తిరుగు ప్రయాణం అవుతున్న హరిప్రసాద్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ముందుగా ఓ బైక్‌ను ఢీకొట్టి, అనంతరం ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారు డ్రైవర్ హరిప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక సీటులో ప్రయాణిస్తున్న గురవయ్య తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
అయితే బైక్‌ను నడుపుతున్న హరికృష్ణ హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కారు బైక్‌ను ఢీకొన్న సమయంలో వెనుక సీటులో ఉన్న పూజా సామగ్రిలోని కొబ్బరి బొండం ఎగిరి వచ్చి కారు క్లచ్, బ్రేక్ పెడళ్ల మధ్య ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి కంటైనర్‌ను ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగంతో పాటు క్లచ్, బ్రేక్ మధ్య ఇరుక్కున్న కొబ్బరిబొండం కూడా కారణమై ఉండొచ్చని కొత్తపేట పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- Chicken and Egg Prices: నాన్‌వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
తాజావార్తలు
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో