Sridevi: కోర్టు హీరోయిన్ కీలక ప్రకటన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sridevi: ‘కోర్ట్’ సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవి ఆపళ్ల తన అభిమానులకు, నెటిజన్లకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో తన పేరుతో జరుగుతున్న కొన్ని తప్పుడు ప్రచారాలపై ఆమె స్పందించారు. ఆమె తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన స్టేటస్ ప్రకారం… కొంతమంది వ్యక్తులు తన అనుమతి లేకుండా, తన పేరు, గుర్తింపును వాడుకుంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లను నడుపుతున్నట్లు ఆమె దృష్టికి వచ్చింది.
ఈ నకిలీ అకౌంట్ల వల్ల అభిమానులు మోసపోయే ప్రమాదం ఉండటంతో ఆమె తక్షణమే స్పందించి క్లారిటీ ఇచ్చారు. తన ప్రమేయం లేకుండా, తన పేరు మీద కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు రన్ అవుతున్నాయని శ్రీదేవి పేర్కొన్నారు. ఆయా ఛానెళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవన్నీ నకిలీవని ఆమె స్పష్టం చేశారు. నెటిజన్లు లేదా అభిమానులు ఎవరైనా అలాంటి ఛానెళ్లను చూస్తే, అవి తన అధికారిక ఛానెళ్లుగా భావించవద్దని కోరారు. తనకు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారమైనా, సోషల్ మీడియా అప్డేట్స్ అయినా నేరుగా తన ప్రస్తుత ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారానే పంచుకుంటానని ఆమె స్పష్టం చేశారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ తెలుగమ్మాయి, తన పేరిట జరుగుతున్న ఈ డిజిటల్ అవకతవకలపై అప్రమత్తంగా ఉంటూ అభిమానులను కూడా అలర్ట్ చేశారు.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!