Nokia 235 4G: AI అసిస్టెంట్ బటన్‌తో నోకియా కొత్త 4G ఫీచర్ ఫోన్లు విడుదల.. 13 రోజుల బ్యాటరీ బ్యాకప్
- నోకియా కొత్త 4G ఫీచర్ ఫోన్లు విడుదల
- 13 రోజుల బ్యాటరీ బ్యాకప్
- వైర్డ్ & వైర్లెస్ FM రేడియో వంటి ఫీచర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ బ్రాండ్ నోకియా కొత్త 4G ఫీచర్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. Nokia 235 4G (2026), Nokia 215 4G (2026), Nokia 210 4G, Nokia 200 4G పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు AI అసిస్టెంట్ బటన్, 4G కనెక్టివిటీ, దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్లు కంపెనీ అధికారిక వెబ్సైట్లో జాబితా చేయగా, ధరలు, విక్రయాల తేదీలను ఇంకా ప్రకటించలేదు.
AI అసిస్టెంట్ బటన్ ప్రధాన ఆకర్షణ
ఈ కొత్త ఫీచర్ ఫోన్లలో ప్రత్యేక AI అసిస్టెంట్ బటన్ ను అందించారు. ఈ బటన్ ద్వారా యూజర్లు వాయిస్ కమాండ్లతోనే ఆపరేట్ చేయవచ్చు. వాటిలో.. ఫ్లాష్‌లైట్ ఆన్/ఆఫ్ చేయడం, అలారాలు సెట్ చేయడం, రిమైండర్లు సృష్టించడం, కాంటాక్ట్స్‌లోని వ్యక్తులకు నేరుగా కాల్ చేయడం వంటి పనులు సులభంగా చేయవచ్చు.
Also Read
- August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
- Tecno 0mm Bezel Smartphone: స్క్రీన్ చుట్టూ బెజెల్స్ మాయం! 0mm డిస్ప్లే బోర్డర్‌తో టెక్నో కొత్త కాన్సెప్ట్ ఫోన్
- Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
- JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్‌లు, 1,000 టీవీ ఛానెల్స్..
13 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్
ఈ నాలుగు మోడళ్లలో కూడా 1,450mAh రిమూవబుల్ బ్యాటరీను అందించారు. Nokia 235 4G (2026), Nokia 215 4G (2026) – 10 గంటల టాక్‌టైమ్, 12 రోజుల స్టాండ్‌బై, Nokia 210 4G, Nokia 200 4G – 9 గంటల టాక్‌టైమ్, 13 రోజుల స్టాండ్‌బై అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
డిస్ప్లే వివరాలు
Nokia 235 4G (2026), Nokia 215 4G (2026) – 2.8-అంగుళాల IPS QVGA డిస్ప్లే
Nokia 210 4G, Nokia 200 4G – 2.4-అంగుళాల QVGA డిస్ప్లే
స్టోరేజ్, సాఫ్ట్వేర్
ఈ నాలుగు ఫోన్లు S30+ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తాయి. 64MB RAM, 128MB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో SD కార్డ్ ద్వారా 32GB వరకు స్టోరేజ్ విస్తరణ సౌకర్యం అందుబాటులో ఉంది.
కెమెరా ఫీచర్లు
Nokia 235 4G (2026)
2MP రియర్ కెమెరా
LED ఫ్లాష్
VGA సెల్ఫీ కెమెరా
Nokia 215 4G (2026)
VGA ఫ్రంట్ కెమెరా
Nokia 210 4G
VGA రియర్ కెమెరా
LED ఫ్లాష్
VGA ఫ్రంట్ కెమెరా
Nokia 200 4G
VGA ఫ్రంట్ కెమెరా
కనెక్టివిటీ ఫీచర్లు
అన్ని మోడళ్లలో:
4G VoLTE సపోర్ట్
Bluetooth 5.0
USB Type-C పోర్ట్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
వైర్డ్ & వైర్లెస్ FM రేడియో వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ధర ఇంకా వెల్లడి కాలేదు
నోకియా ఈ నాలుగు కొత్త ఫీచర్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో పరిచయం చేసినప్పటికీ, వాటి ధరలు, భారత్‌లో విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ఈ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Tejeswini Nandamuri : హీరోయిన్గా బాలయ్య చిన్న కూతురు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 క్లర్క్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, పూర్తి వివరాలు
-
Alluri Sitarama Raju International Airport: ఉత్తరాంధ్రకు గేట్‌వే.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రత్యేకతలివే..
-
Asmita Dey: తండ్రి చనిపోయి 7 నెలలు… కూతురు తెచ్చిన గోల్డ్ దేశాన్నే కదిలించింది!
-
Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!