Kavitha: కవితకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha: కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఝలక్ ఇచ్చింది. ఇటీవల ఆమె స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ పేరును కొనసాగించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. పార్టీ పేరుపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్లు పేర్కొంటూ, 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
నిర్దేశిత గడువులో కొత్త పేర్లను సూచించకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును మూసివేస్తామని కూడా ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఈ మేరకు కవితకు అధికారిక లేఖ పంపినట్లు సమాచారం. ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుపై వివాదం తలెత్తడంతో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్త పేర్లతో దరఖాస్తును సవరించాలని ఈసీ సూచించింది. అయితే ఈ నిర్ణయంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
తమకు ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా రెండు అభ్యంతరాలు మాత్రమే అందాయని.. వాటికి ఇప్పటికే సమాధానాలు పంపినట్లు కవిత వెల్లడించారు. మిగతా అభ్యంతరాల వివరాలు తెలియజేయకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా అడుగుతారని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా, కొత్త పేర్లను సమర్పించే ఆలోచన లేదని స్పష్టం చేసిన కవిత.. అవసరమైతే పార్టీ పేరు విషయంలో న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ రక్షణ సేన పేరును కొనసాగించేందుకు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా, తెలంగాణ రక్షణ సేన పేరుపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందిన కారణంగానే ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కోరినట్లు ఈసీ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!