మత్తు వదలరా… గంజాయి మత్తువదలరా అని పాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏపీలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. గంజాయి, మత్తు పదార్ధాలకు బానిసైన యువత ఘోరాలకు కారణం అవుతున్నారు. ఆస్తి కోసం కన్నవారినే కడతేరుస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే హత్యలకు, తీవ్రమయిన దాడులకు తెగబడుతున్నారు. గంజాయి మత్తులో విజయవాడలో చోటుచేసుకున్న ఘటన సభ్యసమాజాన్ని నివ్వెరపరిచింది. విజయవాడలో స్నేహితుడి పై దాడి చేసి హత్య చేశారు మిగతా ముగ్గురు స్నేహితులు. గంజాయి మత్తులో హత్య చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు.
Read Also: Vande Bharat Train: వందే భారత్ రైలుకు తప్పిన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..
స్నేహితుల దాడిలో హత్యకు గురైన వ్యక్తిని అజయ్ సాయిగా గుర్తించారు. నిందితులను నాగార్జున, మణికంఠ, ప్రశాంత్ గా గుర్తించారు పోలీసులు. ఇయర్ బర్డ్స్ విషయంలో వివాదం తలెట్టంతో అజయ్ పై మిగతా ముగ్గురు తీవ్రంగా దాడిచేయడం కలకలం రేపింది. కంకిపాడులో రోడ్డు ప్రమాదం జరిగినట్టు ఆసుపత్రిలో చేర్చి డ్రామా ఆడిన నిందితులకు వైద్యులు షాకిచ్చారు. అయితే, ప్రమాదం వల్ల తగిలిన దెబ్బలు కాదని దాడి చేస్తే తగిలిన దెబ్బలు గా నిర్ధారించి పోలీసులకు సమాచారం అందించారు వైద్యులు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.
Read Also: Tomato Prices Down: టమోటా రైతుల ఆవేదన.. కేజీ 2 రూపాయలే