విధి నిర్వహణలో పోలీసులు ఎంతోమంది అసువులు కోల్పోతున్నారు. విధినిర్వహణలో చనిపోయిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా. విజయవాడ నగరంలో పనిచేస్తున్న హోంగార్డులలో ఎవరైనా మరణించిన లేక పదవీ విరమణ చేసిన వారు ఆర్ధికంగా ఇబ్బందులు పడకుండా చేయడానికి నగరంలో పనిచేస్తున్న హోంగార్డులు అందరూ స్వచ్ఛందంగా వారికి వచ్చే వేతనం నుండి సదరు చనిపోయిన హోంగార్డు కుటుంబాలకు లేదా పదవీ విరమణ చేసిన హోంగార్డులకు ఆర్థిక ఆసరా కల్పిస్తున్నారు.
Read Also: Good News for Drinkers : మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యంపై పన్ను రద్దు
ఈ సందర్భంగా విజయవాడ నగర హోంగార్డు యూనిట్ నందు విధులు నిర్వహిస్తూ అక్టోబర్ 26 2022వ తేదీన మదురై సౌందర రాజు, (హెచ్.జి. నెం 963) గారు హార్ట్ అట్టాక్ తో మరణించాడు. వారి కుటుంబానికి ఆర్ధిక సహాయంగా రూ. 5 లక్షల చెక్కును మంగళవారం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా చేతులమీదుగా చనిపోయిన హోంగార్డ్ సౌందర రాజు భార్య మహాలక్షి కి అందచేశారు. కుటుంబానికి అన్నివిధాలుగా సాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి.సి.పి. మోకా సత్తిబాబు, హోంగార్డు ఆర్.ఐ. శ్రీ కృష్ణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Also:
Veera Simha Reddy: ఒంగోలు ఊపిరి పీల్చుకో.. వీరసింహారెడ్డి వస్తున్నాడు