తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమాలో నటిస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా తర్వాత దర్శకుడు వినోద్ తో విజయ్ తన 69వ సినిమాని చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలే కాకుండా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు ఇదివరకు వార్తలు గట్టిగా వినిపించాయి. అందుకు సంబంధించి వాటిని కన్ఫామ్ చేస్తూ కూడా డైరెక్టర్ కొన్ని కామెంట్ చేశారు. దీంతో విజయ్ అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
Also Read: Happy Birthday Sachin: ఈ పుట్టినరోజు ఎంతో స్పెషలంటున్న సచిన్.. వీడియో వైరల్..
అయితే డైరెక్టర్ వెట్రిమారన్ తో విజయ్ సినిమా చేస్తున్నాడంటే తమిళ ఇండస్ట్రీ మొత్తం భారీగా హైప్ క్రియేట్ అయింది. కాకపోతే తాజాగా డైరెక్టర్ చేసిన కామెంట్స్ తో పూర్తిగా తేలిపోయింది. దీనికి కారణం.. తాజాగా జరిగిన ఓ తమిళ ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ ను విజయ సినిమా గురించి యాంకర్స్ ప్రశ్నలు అడిగారు.
Also Read: Viral Video : పోలీసా.. మజాకా.. డ్యాన్స్ ఇరగదీసిన పోలీస్.. వీడియో వైరల్..
ఆ ప్రశ్నలకు దర్శకుడు వెట్రిమారన్ సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం బిజీగా ఉన్న పరిస్థితుల్లో ఆ సినిమా జరుగుతుందని తాను అనుకోవట్లేదని షాకింగ్ కామెంట్ చేశారు. దాంతో వీరిద్దరి మధ్య చేయబోయే సినిమా ఇక లేనట్లే అని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఇకపోతే దీనికి కారణం లేకపోలేదు. తాజాగా హీరో విజయ్ కొత్త పార్టీని స్థాపించి 2026 లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు సంగతి మనకు విధితమే. కాబట్టి డైరెక్టర్ విజయ్ పొలిటికల్ క్యాంప్ ను ఇబ్బంది పెట్టకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వెట్రిమారన్ సినిమా అంటే టాలీవుడ్ లో రాజమౌళి డైరెక్టర్ తో సినిమా తీసినట్లే లెక్క. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు షూటింగ్ పూర్తి అవుతుందో అంచనా వేయలము.