ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ నేడు ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా చాలా ముఖ్యమైన మ్యాచ్ లో తలపడనున్నాయి . ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది గేమ్ లు ఆడగా మూడు గెలిచి ఐదు ఓడిపోయింది. దింతో పాయింట్స్ పట్టికలో 8వ స్థానంలో ఉండిపోయింది. ఇక మరోవైపు గుజరాత్ టైటాన్స్ కాస్త మెరుగ్గా ఉంది. ఆడిన 8 మ్యాచ్ లలో నాలుగు గెలిచి, నాలుగు ఓడింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్లే ఆఫ్ అర్హత సాధించాలంటే తమ మిగిలిన ఆరు గేమ్ లలో ఐదింటిని గెలవాలి. ఇక అలాగే గుజరాత్ టైటాన్స్ కు మిగిలిన ఆరు మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లలో విజయాలు తప్పనిసరి. కాబట్టి ఈ గేమ్ రెండు జట్లకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ గా మారింది.
Also Read: Kakarla Suresh: ప్రచారంలో దూసుకుపోతున్న కాకర్ల.. అడుగడుగునా నీరాజనం
ఇక ఇరుజట్లు ఈ సీజన్లో ఏప్రిల్ 17న తలపడగా అందులో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ వికెట్ల భారీ విజయనందుకుంది. ఆ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో అత్యల్పస్కోరును నమోదు చేసింది. కేవలం 89 పరుపులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. ఇక లక్ష్య చేదనలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇక నేటి మ్యాచ్ లో ఆడే ఆటగాళ్ల వివరాలను చూస్తే..
Also Read: Soda : వేసవిలో సోడాలను ఎక్కువగా తాగుతున్నారా? మీరు డేంజర్లో పడ్డట్లే..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XIని అంచనాగా.. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, రిషబ్ పంత్ (c & wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే ఆటగాళ్లు ఉండనున్నారు. ఇక మరోవైపు..
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XIని అంచనాగా శుభమాన్ గిల్ (c), వృద్ధిమాన్ సాహా (WK), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సందీప్ వారియర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సాయి కిషోర్ లు ఆడనున్నారు.