తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.. విజయ్ సినిమా కేరీర్ మొదట్లో విజయ్ తెలుగు సినిమాలను రీమేక్ చేశారు.. ఆ సినిమాలు దాదాపు హిట్ టాక్ ను అందుకున్నాయి.. విజయ్ ఏ హీరో సినిమాలను రీమేక్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీకాంత్ హీరోగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన పెళ్లి సందడి తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.. ఆ సినిమాను విజయ్ తమిళ్ రీమేక్ లో నటించారు.. కోలీవుడ్ రీమేక్‌లో రంభ, దేవయాని కథానాయికలుగా కనిపించారు. తమిళంలో ఈ మూవీని అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేశాడు.. ఈ సినిమా విజయ్ కేరీర్ లో భారీ విజయాన్ని అందుకుంది..
వెంకటేష్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ మూవీ పవిత్ర బంధం.. విజయ్ రీమేక్ చేశారు.. హీరోయిన్ గా సిమ్రాన్ నటించారు.. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తోనే వందరోజులు ఆడింది.. మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన ఒక్కడు, పోకిరి సినిమాలు తమిళంలో రీమేకయ్యాయి. ఈ రెండు రీమేక్‌లలో దళపతి విజయ్ హీరోగా నటించాడు.. ఆ రెండు సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.. కళ్యాణ్ రామ్ అతనొక్కడే,నాగార్జున ఆజాద్, చిరునవ్వుతో సినిమాలను తమిళ్ లో రీమేక్ చేశాడు.. ఇప్పుడు విజయ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.. అలాగే రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..