Ramayana : యష్ వర్సెస్ విజయ్ సేతుపతి.. నితేష్ తివారీ రామాయణంలో అదిరిపోయే ట్విస్ట్!

Ramayana, Vijay Sedhupathi Bishma

Ramayana, Vijay Sedhupathi Bishma

నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం రోజురోజుకు అంచనాలను పెంచేస్తోంది. కేవలం ఒక సినిమాగా కాకుండా, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక అద్భుత ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ విజువల్ వండర్‌లో ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందనే వార్త ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఏంటి అంటే..

Also Read : Funky : విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. థియేటర్లోనే గ్రాండ్ రిలీజ్!

ఈ మూవీలో రావణుడిగా నటిస్తున్న రాకింగ్ స్టార్ యష్‌కు తమ్ముడు, విభీషణుడి పాత్రలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కనిపించబోతున్నారని సమాచారం. అధర్మం వైపు నడిచే అన్నకు, ధర్మం కోసం నిలబడే తమ్ముడికి మధ్య జరిగే పోరాటంలో ఈ ఇద్దరు దిగ్గజ నటుల పెర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ఇక హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్, హాన్జ్ జిమ్మెర్ వంటి దిగ్గజాలు సంగీతం అందిస్తుండటం విశేషం.

రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి పార్ట్ 2026 దీపావళికి విడుదల కానుంది. ఇక ఈ ఏడాది మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా రాముడు, సీత పాత్రల ఫస్ట్ లుక్ లేదా టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచస్థాయి విజువల్స్‌తో చూడాలని ఆశిస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప అనుభూతిని మిగల్చనుంది.