Vijay Sethupathi: నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం జైలర్. ఈ చిత్రం సూపర్, డూపర్ హిట్ కావడంతో తాజాగా జైలర్-2 ను తెరకెక్కించే పనిలో మేకర్స్ ఉన్నారు. రిలీజ్‌కు ముందు నుంచే జైలర్ -2 సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఒక స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారని, ఇప్పటికే ఆయనకు సంబంధించిన సీన్లను చిత్రీకరిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు, ఆయన నిజంగానే ఈ సినిమాలో భాగం అయ్యారా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Crime: కోరిక తీర్చనందుకు వివాహిత మరదలిని కాల్చి చంపిన వ్యక్తి..
జైలర్ – 2 సినిమాలో పలువురు స్టార్స్ కేమియో పాత్రల్లో కనువిందు చేస్తారని గతంలోనే చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి భాగం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సేతుపతి సీన్లను గోవాలో షూట్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. గతంలో కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పెట్టా’ సినిమాలో రజినీకాంత్-విజయ్ సేతుపతి కలిసి నటించారు. అయితే జైలర్-2లో నిజంగానే విజయ్ సేతుపతి నటిస్తున్నాడా అనే విషయంపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి – పూరీ జగన్నాథ్ డైరెక్టర్ ఒక ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో పూరీ హీరో రజినీకాంత్ సినిమాలో భాగం అయ్యాడనే వార్తలు వైరల్‌గా మారాయి.
READ ALSO: BCCI Deadline: గంభీర్‌కు డెడ్ లైన్ ప్రకటించిన బీసీసీఐ !