టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 కొత్త ఏడాది వేడుకలను ఇటలీలోని రోమ్ నగరంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను విజయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, అందులో ఒక రొమాంటిక్ పిక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. విజయ్ వెనక నిలబడి రష్మిక అతడిని గట్టిగా హత్తుకున్న ఫోటో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. “హ్యాపీ న్యూ ఇయర్ మై డార్లింగ్ లవ్స్.. అందరం కలిసి గొప్ప జ్ఞాపకాలను పోగు చేసుకుందాం” అంటూ విజయ్ తన పోస్ట్‌లో ఎమోషనల్ నోట్ జత చేశారు. ఈ ఫోటోలలో విజయ్ ఐకానిక్ స్మారక చిహ్నాల ముందు స్టైలిష్‌గా కనిపిస్తుండగా, రష్మిక వెనుక నుండి ఇచ్చిన హగ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read : Dhurandhar : ‘ధురంధర్’కు సెన్సార్ షాక్.. ఆ పదం తొలగించాలంటూ కేంద్రం ఆదేశాలు!
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ అక్టోబర్ 2025లో ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, విజయ్ – రష్మిక వచ్చే ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అట్టహాసంగా వివాహం చేసుకోబోతున్నారు. అందుకే ఈ న్యూ ఇయర్ వెకేషన్‌ను వీరు మరింత ప్రత్యేకంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. “మిమ్మల్ని వివాహ బట్టల్లో చూడటానికి వెయిట్ చేయలేకపోతున్నాం” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.