Vijay Devarakonda : రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఇటీవల కాలంలో హిట్ అందుకోవడంలో వెనుకబడి ఉన్నాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఐతే ఈ సినిమా తర్వాత విజయ్ రెండు భారీ ప్రాజెక్ట్ లను ప్లాన్ చేస్తున్నాడు. అందులో ఒకటి రవికిరణ్ కోలా దర్శకత్వంలో వస్తుంటే మరొకటి శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో వస్తుంది. ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరమే సెట్స్ మీదకు వెళ్లే విధంగా ఉన్నాయి. విజయ్ దేవరకొండ 12వ సినిమా మార్చిలో విడుదల అవుతుంది అంటున్నారు. సినిమా మార్చి నుంచి వేసవిలో విడుదల చేసే ప్లాన్ ఉంది. ఐతే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా సినిమా రెండు భాగాల్లో విడుదల చేస్తామని అంటున్నారు. ఐతే ఈ సినిమా తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేసే సినిమా కూడా ఉంది. ఐతే రాహుల్ తో విజయ్ చేసే సినిమా మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
Read Also:Khalistani terrorist: కుంభమేళాపై దాడి చేస్తాం.. టెర్రరిస్ట్ పన్నూ బెదిరింపులు..
రాహుల్ సంకృత్యన్ తో విజయ్ ఇంతకు ముందు ఆల్రెడీ టాక్సీవాలా అనే సినిమా చేశాడు. మళ్లీ ఇప్పుడు అతనితో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఐతే ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా రెండు పార్టులుగా రిలీజ్ చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ రాహుల్ సినిమా పీరియాడికల్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను విజయ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ తో తన కథ విధానం ఏంటో అన్నది ప్రూవ్ చేసుకున్న రాహుల్ ఈసారి పీరియాడికల్ కథతో నెక్స్ట్ లెవెల్ తో రాబోతున్నారట. అంతేకాదు ఈ సినిమాను కూడా రెండు పార్టులుగా తీసే ప్లాన్ లో ఉన్నారట. ఈ సంవత్సరం ద్వితియార్థంలో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని తెలుస్తుంది. విజయ్, రాహుల్ కాంబో కంప్లీట్ గా సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ ప్లానింగ్ చూసి అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు. విజయ్ నుంచి ఇక మీదట వచ్చే సినిమాలన్నీ దాదాపు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.
Read Also:Redmi 14C: 50MP డ్యూయల్ కెమెరాతో బడ్జెట్ ఫోన్‌ను రిలీజ్ చేయనున్న రెడీమి