Vijay Devarakonda : రోజురోజుకు ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. మీ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేస్తున్నట్లు ఫోన్ చేయడం, ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, హెల్త్‌కేర్ లేదా టెలికాం ఉద్యోగులు ప్రభుత్వ అధికారులుగా బ్యాంకు వినియోగదారులకు ఫోన్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కేవలం సినిమాలతోనే కాకుండా కొన్నిసార్లు సమాజానికి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రత్యేకమైన మెసేజ్ లు కూడా ఇస్తుంటారు. తాజాగా ఆయన ఆన్ లైన్ మోసాలపై మరోసారి తనదైన శైలిలో ఒక వివరణ ఇచ్చారు. ఫేక్ కాల్స్, మెసేజ్‌లపై అభిమానులకు హెచ్చరికలను జారీ చేశారు.
Read Also:Pawan Kalyan: భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా మోడీ మార్చారు
సైబర్ నేరాలు, మోసాల పట్ల ప్రతి ఒక్కరూ ఎప్పటి కప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ మెసేజ్ తో సైబర్ నేరగాళ్ల చిట్కాలను గుర్తించమని విజ్ఞప్తి చేశారు. విజయ్ ఈ వీడియోలో తన స్నేహితుడి అనుభవాన్ని పంచుకున్నారు. యూపీఐ పేమెంట్స్ ఎంత సురక్షితమైనవో చెప్పడంతో పాటు, కొన్ని సందర్భాల్లో మోసగాళ్లు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లుగా చూపిస్తూ నకిలీ మెసేజ్‌లు పంపిస్తారని తెలిపారు. టెక్నాలజీ వృద్ధితో పాటు నేరగాళ్ల మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా ఫేక్ మెసేజ్‌లు లేదా కాల్స్ చేస్తే, డబ్బులు పంపే ముందు నిజానిజాలు బాగా తెలుసుకోండి.. ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు, కంగారు పడకుండా బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయాలని సూచించారు. ‘‘ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే, వారికి చెప్పండి, నేను మూర్ఖుడిని కాదు’’ అని విజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయ్ పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD 12 అనే సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సమ్మర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు రవికిరణ్ కోలా దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Read Also:Apple: జీతాల మోసం..185 మందిని తొలగించిన యాపిల్.. ఇంత కక్కుర్తి ఎందుకు..