Apple: జీతాల మోసం..185 మందిని తొలగించిన యాపిల్.. ఇంత కక్కుర్తి ఎందుకు..
- యాపిల్ సంస్థ ఉద్యోగుల ఘరానా మోసం..
- ఛారిటీ నిబంధనలు ఉపయోగించి ఫ్రాడ్..
- 185 మంది ఉద్యోగుల్ని తొలగించిన యాపిల్..
- ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారతీయులే..
- యూఎస్ తెలుగు సంఘాలతో సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple: జీతాల మోసానికి పాల్పడిన ఉద్యోగులను యాపిల్ సంస్థ తొలగించింది. ఛారిటీ నిబంధనలను దుర్వినియోగం చేసిన ఉద్యోగులను తీసేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు కోల్పోయిన వారిలో భారతీయులతో సహా 185 మంది ఉన్నట్లు సమాచారం. ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అనుమతించే కార్యక్రమాన్ని ఉద్యోగులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నివేదికల ప్రకారం..జీతాల మోసానికి పాల్పడ్డారు. తమ పరిహారాన్ని పెంచుకోవడానికి మెసానికి పాల్పడ్డారని గుర్తించారు. దీంతో యాపిల్ దీనితో సంబంధం ఉన్న ఉద్యోగులను తొలగించింది. తొలగించబడిన ఉద్యోగుల్లో బే ఏరియాలోని అధికారులు ఆరుగురిని గుర్తించారు. వారిపై అరెస్ట్ వారెంట్ల్ జారీ చేయబడ్డాయి. అయితే, ఆరుగురిలో ఎవరూ భారతీయులు లేరు. కానీ తొలగించబడిని ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వ్యక్తులే ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
Read Also: Cyberabad Police: సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..
అమెరికాలోని కొన్ని తెలుగు స్వచ్ఛంద సంస్థలను దుర్వినియోగం చేసి మోసానికి పాల్పడినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. అయితే, దీనిపై యాపిల్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. లాస్ ఏంజిల్స్‌లోని జిల్లా న్యాయవాది కార్యాలయం రిపోర్టుల ప్రకారం.. యాపిల్ తన మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్‌ని దుర్వినియోగం చేసిన కారణంగా బే ఏరియా ఆఫీసు నుంచి అనేక మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది.
ఉద్యోగుల్లో సామాజిక బాధ్యతను పెంచేందుకు, లాభాపేక్ష లేని సంస్థలకు సేవా కార్యక్రమాల కోసం విరాళాలు ఇచ్చేలా ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తుంది. ఇలా ఉద్యోగులు ఏ సంస్థకైతే విరాళం ఇస్తారో, ఆ సంస్థకు మ్యాచింగ్ గ్రాంట్ కలిపి యాపిల్ విరాళం ఇస్తుంది. ఇదే ఉద్యోగులకు వరంగా మారింది. సదరు సంస్థలు తిరిగి ఈ విరాళాలను సేవ కోసం ఉపయోగించకుండా ఉద్యోగులకు రిటర్న్ చేసినట్లు తేలింది. యూఎస్ కంపెనీల టాక్స్ లెక్కలను చూసే ఇంటర్నల్ రెవన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) ఉద్యోగుల మోసాన్ని కనిపెట్టింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..