విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ను శివ నిర్వాణ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్స్, ట్రైలర్ వంటివి సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ కచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటారని అంతా భావిస్తున్నారు.ఇలా వరుసగా ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతున్న విజయ్ దేవరకొండ మొదటిసారి తన కెరియర్ లో వచ్చిన ఫ్లాప్స్ గురించి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్,నోటా,లైగర్ వంటి సినిమాలు డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇలా ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి గల కారణాన్ని విజయ్ దేవరకొండ తెలిపారు.తాను ఎప్పుడూ కూడా అద్భుతమైన కథను ఎంపిక చేసుకుంటానని ఆయన తెలిపారు. అయితే సినిమాలు షూటింగ్ చేసే సమయంలో అనుకున్న ప్రణాళికలో సినిమాని తెరకెక్కించకపోవడమే సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం అంటూ ఈయన తెలిపారు.. సినిమా కోసం ప్రచార కార్యక్రమాలతో సహా నేనేదైనా భిన్నంగా చేయాలనుకుంటాను.భారీగా ఉండే కథలనే ఎంచుకోవాలని అనుకున్నా కానీ అది కుదరడం లేదు. నేను నటించే ప్రతి సినిమా విజయం సాధించాలని అభిమానులు సన్నిహితుల కోరుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుంది అయితే సినిమా అంటేనే బిజినెస్ ఈ బిజినెస్ లో ఒత్తిడి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అని ఆయన తెలిపారు. నాకు ఒక సొంత థియేటర్ ఉందని ఒక సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా ఆ ప్రభావం ఎలా ఉంటుందో బాగా తెలుసు అంటూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.