టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ ప్రొడక్షన్ బ్యానర్ ను నవీన్ యర్నేని ,యలమంచిలి రవి శంకర్ ,మోహన్ చెరుకూరి నిర్మాతలుగా 2015 లో ఎంతో గ్రాండ్ గా స్థాపించారు .సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ప్రొడక్షన్ బ్యానర్ తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. ఆ తరువాత ఈ బ్యానర్ నుంచి వరుసగా బిగ్ మూవీస్ వచ్చాయి.జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్ నుంచే వచ్చాయి . ప్రస్తుతం ఈ టాప్ బ్యానర్ నుంచి పలు బడా మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా వున్నాయి.వాటిలో మాస్ మహారాజా రవితేజ ,గోపీచంద్ మలినేనిల కాంబో మూవీ అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 వంటి బిగ్ మూవీ స్ వున్నాయి. ఇవే కాకుండా పలు క్రేజీ సినిమాలు ఈ బ్యానర్ లో తెరకెక్కుతున్నాయి.ఇదిలా ఉంటే ఈ బ్యానర్‌కు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తమ బ్యానర్ లో సరికొత్త మూవీని అనౌన్స్ చేయనున్నట్లు ఎక్స్ వేదికగా నిన్న మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.
తాజాగా ఆ స్పెషల్ అప్డేట్ రివీల్ చేసింది..నేడు విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ విజయ్ కు బర్త్డే విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.మైత్రి మూవీస్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ మూవీస్ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించి VD14 వర్కింగ్ టైటిల్ తో ఓ ఆసక్తికర పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహం ఉంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని దీని గురించి తెలిపారు. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని పోస్టర్ పై వుంది.ఇతిహాసాలు రాయలేదు, అవి యోధుల రక్తంలో ఇమిడిపోయాయి అని ఆసక్తికరంగా ఈ సినిమాని మేకర్స్ ప్రకటించారు.తాజాగా ఈ పోస్టర్ తోనే మేకర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచారు. విజయ్ దేవరకొండ రాజుల కాలంలో యోధుడిగా ఈ సినిమాలో కనిపించనున్నారు.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది .
Epics are not written, they are etched in the blood of heroes ⚔️
Presenting #VD14 – THE LEGEND OF THE CURSED LAND 🔥
Happy Birthday, @TheDeverakonda ❤️🔥
Directed by @Rahul_Sankrityn
Produced by @MythriOfficial pic.twitter.com/FVorlWkLmd
— Mythri Movie Makers (@MythriOfficial) May 9, 2024