ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తమిళ హీరో విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సిరీస్ సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఇప్పుడు సరికొత్త లవ్ ఎంటర్టైనర్ రోమియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తెలుగులో లవ్ గురు పేరుతో ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ ను విజయ్ గట్టిగానే చేశాడు.. భార్యాభర్తల మధ్య సాగే ఎమోషనల్ కథగా ఈ సినిమా వచ్చింది..
ఇదిలా ఉండగా ఈ సినిమాను మల్టీ ఫ్లెక్స్ లలో కూడా నార్మల్ రెట్లకే సినిమాను చూడొచ్చు.. తాజాగా టిక్కెట్ ధరలు రూ.150 రూపాయలు అని యూనిట్ ప్రకటించారు.. అంతేకాదు పోస్టర్ ద్వారా ధరలను ప్రకటించారు.. ఇక ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్. విజయ్ ఆంటోనీ తల్లిగా తెలుగు నటి సుధ, మావయ్యగా వీటీవీ గణేష్ నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు సినిమా విడుదలైంది.. ఈ సినిమా మొత్తం భార్య భర్తల మధ్య సాగే కథగా ఉంది.. పెళ్లి అంటే ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్న విజయ్ తన భార్య ప్రేమను ఎలా పొందుతాడో ఈ సినిమాలో చూపిస్తారు..
డైలాగుల్లో ఆయన క్యారెక్టర్ మీద పడిన సెటైర్స్ నవ్విస్తాయి. నటుడిగా కంటే ఎడిటర్గా విజయ్ ఆంటోనీ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ల్యాగ్ లేకుండా సీన్ టు సీన్ ట్రాన్సిషన్ బాగా చూపించారు.. మొత్తంగా సినిమా సరికొత్త కథగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. వీకెండ్ కాసేపు సరదాగా నవ్వుకోవడానికి ‘లవ్ గురు’కు వెళ్ళవచ్చు. కథ, కథనం పరంగా ప్రేక్షకులకు సర్ప్రైజెస్ ఏమీ లేవు. సిస్టర్ సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా నచ్చుతుంది.. సో సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..