Milind Parande: ఉదయనిధి స్టాలిన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Milind Parande: సనాతన ధర్మంపై కామెంట్లు చేసి ఒక్కసారి హిందూ సంఘాలు, వీహెచ్‌పీ నేతలు, బీజేపీకి టార్గెట్ అయిపోయారు తమిళనాడు సీఎం కుమారుడు, మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్.. ఇక, ఉదయనిధి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు వీహెచ్‌పీ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మంపై భయానక వ్యాఖ్యలు చేసిన సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉదయనిధి స్టాలిన్‌ను పదవి నుంచి తొలగించాలన్న ఆయన.. తమిళనాడు ప్రభుత్వం విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అన్నారు.
Read Also: Asia Cup 2023: కోహ్లీ అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించిన బీజేపీ ఎంపీ.. అది తట్టుకోలేకపోయానంటూ..!
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ఇక, ఉదయనిధి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసును తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు మలింద్ పరాండే.. మరోవైపు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుల నియామకంపై స్పందిస్తూ.. టీటీడీ బోర్డులోకి అన్యులను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నారు. తిరుమల దర్శనం అందరికీ అందేలా సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ భక్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలి.. స్వయం ప్రతిపత్తి కలిగిన దేవాలయాల నిర్వహణ హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. క్రైస్తవ మిషనరీలు, ముస్లింలు మత మార్పిడులు చేయడాన్ని మేం ఆపుతామని ప్రకటించారు. ప్రభుత్వాలు.. దేవాలయాలను కంట్రోల్ చేయడం సరైనది కాదని వార్నింగ్ ఇచ్చారు. భజరంగ్ దళ్ శౌర్య యాత్ర చేయబోతున్నాం.. ఏపీలో మతమార్పిడులు ఎక్కువగా జరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. విశ్వహిందూ పరిషత్ కు ఇది 60వ సంవత్సరం.. వీహెచ్‌పీని ఈ సంవత్సరం లక్ష స్ధానాలకు వ్యాపింపచేయడం మా ఉద్దేశం అని.. కోటి మందిని వీహెచ్‌పీలోకి తీసుకొస్తాం.. 1058 వ్యవస్ధాపక జిల్లాలుగా భారతదేశాన్ని విభజించామని తెలిపారు వీహెచ్‌పీ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?