ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పని చేసిన దేవేందర్ గౌడ్.. రాజ్యసభలో చేసిన ప్రసంగాలు, వారు కేబినెట్ మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీ శాసనసభలో చేసిన ప్రసంగాలతో వెలువరించిన పుస్తకాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి కంటే వెంకయ్య నాయుడుగా గుర్తిస్తేనే ఆనందమన్నారు. దేవేందర్ గౌడ్ అదర్ష నాయకుడు అని, ఆయనకు ఇచ్చిన హోదాకు గౌరవం తెచ్చారన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో లేను.. ప్రజా జీవనంలో ఉన్నానని, పార్టీ రాజకీయాలపై వ్యాఖ్యానించను… ఎప్పుడు పార్టీ నీ చూడొద్దు… విషయాని చూడాలి… ప్రాధాన్యతను చూడాలి.. తల్లిలా చూసిన పార్టీ నీ వడిలేసేటప్పుడు కంట నీరు పెట్టుకున్నానని ఆయన అన్నారు.
13వ నెలలో తల్లిని కోల్పోయా మా తాత నుంచి… కుటుంబ వ్యవస్థ గురించీ ఎంతో తెలుసుకున్నానని, వెనకబడ్డ వర్గాల కోసం ntr ఎంతో కష్టపడ్డారని, రాజకీయాలు కోసం కాదు… ప్రజా సంక్షేమం కోసం పాటు పడ్డ వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. దేవేందర్ గౌడ్ తన విలువైన అనుభవాలను పుస్తక రూపంలోకి తేవడం చాలా సంతోషంగా ఉందని, ప్రస్తుత రాజకీయాల్లో కొంతమంది నాయకులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చీదర పుడుతుంది ప్రజా ప్రతినిధులు ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజలు నాయకులను ఎంచుకోవాలన్నారు వెంకయ్య నాయుడు.
కుల మత రాజకీయాలను అడ్డు పెట్టుకొని చీరికలను తెచ్చే వారిని దూరంగా ఉంచాలని, రాజకీయాల్లో ప్రజా జీవనం ఉందన్నారు వెంకయ్య నాయుడు. కారెక్టర్ కాలిబర్ ఉన్న వ్యక్తులను ఎంచుకోవాలని, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాలని విమర్శించాలి కానీ… విమర్శించే ముందు అధ్యయనం చేయాలని, దేశంలో రాష్ట్రంలో గట్టి ప్రతిపక్షం ఉండాలన్నారు. బలమైన ప్రతిపక్షం ఉంటే ప్రజాస్వామ్యం బాగుంటుందని, ప్రజా ఆస్తుల ద్వసం… ప్రజాస్వామ్య విధ్వంసం… ఇలా చేయవద్దని ఆయన అన్నారు.
మనం శత్రువులం కాదని, సభను జరగనిచ్చి… ప్రభుత్వాన్ని ఎండగట్టి… ప్రశ్నించాలన్నారు. భాష పోతే శ్వాస పోయినట్లేనని, ప్రజలకు తెలుగే అర్థమవుతుందన్నారు. ఇంగ్లీష్ ను నేర్చుకోవాలి కాని… అదే మాట్లాడొద్దని, మన రాష్ర్టంలో మన భాషే మాట్లాడాలన్నారు. మాట్లాడే భాషలో హుందాతనం ఉండాలని, ఫస్ట్ మదర్ టంగ్… తరువాత బ్రదర్ టంగ్… లాస్ట్ ఎనీ అదర్ టంగ్ ఇంట్లో వండిన ఆహారాన్నే తినాలన్నారు.
వంట పోతే… జంట పోతుంది. చనిపోయిన తరువాత కూడా బతకాలంటే మంచి పని చేయాలి. పత్రికలు నిష్పాక్షికంగా ఉండాలి… అద్దంలాగ వ్యవహరించాలి.
పత్రికలు తమ అభిప్రాయాలు రుద్దవద్దు…. కేవలం విశ్లేషించాలి. పత్రికలు ప్రమాణాలు పాటించాలి. పత్రికలు కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలి. మంచి మిత్రుడు ఎవరంటే మంచి పుస్తకం…’ అని ఆయన అన్నారు.