Kurnool Bus Incident: తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో 19 మంది మృతికి కారణమైన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి వి.కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్యను A1 నిందితుడిగా ఇప్పటికే అరెస్టు చేయగా, ట్రావెల్స్ యజమాని వినోద్ కుమార్‌ను A2 నిందితుడిగా పోలీసులు చేర్చారు. ప్రయాణికుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు జిల్లాలోని ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రావెల్స్ ఓనర్ వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు వినోద్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది.
Reble Star : అంచనాలు పెంచేస్తున్న హను.. ప్రభాస్ కెరిర్ బెస్ట్ ఫిల్మ్ గా ‘ఫౌజీ’
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు కర్నూలు జిల్లా, ఉలిందకొండ మండలం చిన్నటేకూరు క్రాస్ రోడ్డు వద్ద ఒక బైకును ఢీకొనడంతో మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. పోలీసుల FIR కాపీ ప్రకారం డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేశారు. డ్రైవర్‌తో పాటు ఓనర్‌పై ఉలిందకొండ పోలీసులు BNS 125(a), 106(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Ganja Gang Attack: మితిమీరిన గంజాయి బ్యాచ్ ఆగడాలు.. ఆసుపత్రి రిసెప్షనిస్ట్‌పై కత్తితో దాడి..!