ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో ఫౌజీ కూడా ఒకటి. సీతారామం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హను రాఘవపూడి చేస్తున్న సినిమా ఇదే. ఇటీవలె ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కానీ, ప్రభాస్ హాఫ్ లుక్ కాకుండా ఫుల్ లుక్ రిలీజ్ చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపించాయి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో మంచి అంచనాలున్నాయి. కానీ, ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా పై ప్రభాస్ రోజు రోజుకి అంచనాలు పెంచెస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : SSMB 29 : పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఇదేంటి ఇలా ఉంది
లేటెస్ట్‌గా తెలిసిన విషయం ఏంటంటే ప్రభాస్ ఈ సినిమా అవుట్ పుట్ పట్ల ఫుల్ హ్యాపీగా ఉన్నాడట. ప్రభాస్‌ను చాలా కొత్తగా చూపించబోతున్నాడట హను. ముఖ్యంగా ఈ సినిమాలోని కొని సీన్స్ మాత్రం మామూలుగా రాలేదట. ఒక్కో ఫ్రేమ్ అద్భుతం అనేలా తీర్చిదిద్దుతున్నారట. అలాగే.. పాటలు కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటాయట. మొత్తంగా ఫౌజీకి ఫిదా అవుతున్నాడట డార్లింగ్. ఇటు ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత.. త్వరలోనే మైసూర్‌లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ సినిమాతోనే ఆమె హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అవుతోంది. వచ్చే ఏడాది ఆగష్టులో ఫౌజీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.