Bathukamma Festival: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలు మాత్రమే పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ అచ్చమైన ఆడబిడ్డల పండుగ. అశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీరోక్క బతుకమ్మలను తయారు చేసి రకరకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. ఆడబిడ్డలందరూ మెట్టినింటి నుంచి పుట్టింటికి వచ్చి సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. ఇందతా ఓకే కానీ మన తెలంగాణ రాష్ట్రంలోనే 9 రోజుల బతుకమ్మ పండుగ ఒక చోటు 7 రోజులు మాత్రమే నిర్వహిస్తారని మీకు తెలుసా? ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారు..
READ ALSO: Maharashtra: సీఎం యోగిని సమాధి చేస్తా.. ముస్లిం నేత బహిరంగ హెచ్చరిక..?
వేములవాడలో ప్రత్యేక బతుకమ్మ..
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కేవలం వేములవాడలో మాత్రమే ఏడు రోజుల పాటు బతుకమ్మ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా వేములవాడలో ఏడో రోజు వేపకాయల బతుకమ్మను ఇక్కడ సద్దుల బతుకమ్మగా నిర్వహిస్తారు. కేవలం వేములవాడలో మాత్రమే పూర్వకాలం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఇక్కడి మహిళలు తమ పుట్టింటితో పాటు మెట్టినింటిలో కూడా బతుకమ్మను ఆడుతారు. ఈ ఆనవాయితీ వేములవాడలోనే తరతరాలుగా కొనసాగుతూ వస్తుంది. దసరా పండుగను యథావిధిగా ప్రతి ప్రాంతాలలో ఎలా జరుపుకుంటారో ఇక్కడి ప్రజలు కూడా అలానే జరుపుకుంటారు.
వైభవంగా దసరా సంబరాలు
వేములవాడ ప్రాంతంలో బతుకమ్మ పండుగతో పాటు దసరా సంబరాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. స్థానికులు దసరా వేడుకలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే పూజలు, పండగ వాతావరణంలో ఇక్కడ జరుపుకుంటారు. అయితే బతుకమ్మ ప్రత్యేకత వల్ల వేములవాడ దసరా సంబరాలు మరింత వైభవంగా మారుతాయి. ఇక్కడి మహిళలు, యువతులు పాల్గొనే బతుకమ్మ ఆటలు, పాటలు సాంప్రదాయ సౌందర్యాన్ని మాత్రమే కాకుండా, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయి.
READ ALSO: Health Tips: తప్పతాగి పీకలదాకా ఇవి తింటున్నారా? బాబోయ్ డెంజర్!