Health Tips: యూత్ నుంచి వయస్సు మళ్లిన వారి వరకు ఈ రోజుల్లో తాగుడు ఒక ప్యాషన్ అయిపోయింది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం మందు తాగేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బాధ వచ్చిన, సంతోషం వచ్చిన మద్యం ఉండాల్సిందే అంటున్నారు కొందరు. ఇక్కడ విశేషం ఏమిటంటే మెజార్టీ తాగుబోతులకు ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని తెలుసు! కానీ.. తాగుడుకు బానిసలై వ్యసనాన్ని వదిలించుకోలేక పోయే వారి సంఖ్య మామూలుగా లేదంటే నమ్మండి. మద్యంతో దీర్ఘకాలంలో ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో కొంత మంది తాగిన తర్వాత పీకలదాకా నచ్చినవి తింటారు.. ఇది అసలికే ఎసరు తీసుకొస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. ఇంతకీ తాగిన తర్వాత ఏం తినవద్దో తెలుసా?
READ ALSO: Tirumala Laddu Case: తిరుమల లడ్డూ కేసులో సీబీఐ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ
తాగిన తర్వాత వీటిని పొరపాటున కూడా ముట్టకూడదు..
తాగిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ పాలు తాగకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మద్యం తాగే సమయంలో చాలా మంది వేరుశెనగ లేదా జీడిపప్పు తినడానికి ఇష్టపడతారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అని చెబుతున్నారు. మద్యం తాగిన వెంటనే లేదా మద్యం తాగే సమయంలో ఈ రెండు తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయని, కాబట్టి ఇవి తినడానికి నిషేధించాలని సూచిస్తున్నారు. పొరపాటున కూడా మందులో సోడా లేదా శీతల పానీయాలను కలపకూడదని చెబుతున్నారు. ఆల్కహాల్‌కు వీటిని కలిపి తాగితే, శరీరానికి చాలా ప్రమాదం అంటున్నారు. అందుకే తాగే టైంలో ఆల్కహాల్‌కు వీటికి బదులు నీరు లేదా ఐస్ కలిపి తాగవచ్చ,ని సూచిస్తున్నారు.
మద్యం తాగే సమయంలో లేదా తర్వాత క్రిస్ప్స్ లేదా చిప్స్ తినవద్దని చెబుతున్నారు. వీటితో పాటు వేయించిన మోమోస్ లేదా చికెన్‌ను తినడం నివారించాలని అంటున్నారు. ఎందుకంటే ఇది మీ కడుపులో ఆటంకాలు తలెత్తడాన్ని నివారిస్తుందని పేర్కొన్నారు. మత్తును తీపి పెంచుతుందని చెబుతున్నారు. కాబట్టి మద్యం తాగిన తర్వాత స్వీట్లు తినకూడదని, ఎందుకంటే మద్యం తాగిన వారికి తియ్యని ఆహారం విషం లాంటిదని హెచ్చిరస్తున్నారు.
READ ALSO: MiG-21 Success Story: పాక్ అహాన్ని, అమెరికా గర్వాన్ని బద్ధలు కొట్టిన ఫైటర్ జెట్..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.