NTV Telugu Site icon

Vemula Prashanth Reddy : ఏనుముల రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి అంటున్నారు..!

Vemula

Vemula

Vemula Prashanth Reddy : ఇవాళ ఈ రాష్ట్రంలో ట్విట్టర్‌కు టిక్‌టాక్‌కు తేడా తెలియని వాడు, పాలన చెయ్యమంటే ఫాల్తూ మాటలు, పాగల్ మాటలు మాట్లాడుతూ, అచ్చోసిన ఆంబోతులా ఊరేగేవాడు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి. ఇవాళ ఆయన తెలంగాణ భవనలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ పెట్టి తెలంగాణ ప్రజల చేత తన్నించుకొన్నడని, మీరు పెట్టిన సర్వేలోనే KCR కు 70% నీకు 30% ఓట్లు పడేసరికి రేవంత్ రెడ్డి మైండ్‌ బ్లాక్‌ అయ్యిందన్నారు. నిన్న షాద్ నగర్ మీటింగ్‌లో ఫ్రస్టేషన్ తో ఊగి పోతూ ఎప్పటిలాగే ఆ కంపునోరుతో అవే అబద్దాలు అవే సంస్కారం లేని మాటలు అదే బూతులు మాట్లాడిండని ఆయన మండిపడ్డారు. అందుకే నిన్న ప్రజలు ఏనుముల రేవంత్ రెడ్డి గా కాకుండా బూతుల రేవంత్ రెడ్డి అంటున్నారని ఆయన విమర్శించారు.

PM Modi: ఇది ప్రజల బడ్జెట్.. పొదుపు, పెట్టుబడుల్ని పెంచుతుంది..

నేను మాట తప్పే, మడమ తిప్పే రకం కాదు అన్నవు రేవంత్ రెడ్డి… మరి రుణమాఫీ నేను రాగానే డిసెంబర్‌ 9 నాడే చేస్తా అన్నదేవడు ?  తర్వాత తెలంగాణ లో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టి ఆగస్టు 15 లోపు చేస్తా అన్నదెవరు? తర్వాత  మళ్ళీ దసరా లోపు అన్నదెవరు? రేవంత్ రెడ్డి పూర్తీ అయ్యిందా? రుణమాఫీ  నేటికి 4 విడుతలుగా వేసినా కూడా మీ లెక్కల ప్రకారం ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. మా  లెక్కల ప్రకారం ఇంకా 30 లక్షల మందికి కాలేదు. ఇది మాట తప్పుడు కాదా ? అని రేవంత్ రెడ్డి ని ప్రశ్నించారు ప్రశాంత్‌ రెడ్డి.  అందుకే నిన్ను ప్రజలు ఏనుముల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి అంటున్నారని ప్రశాంత్‌ రెడ్డి విమర్శించారు.

అంతేకాకుండా..’నీ నోటితోనే అన్నవు కేసీఆర్‌ రెండు పర్యాయాలు కలిపి 29000 కోట్ల రుణ మాఫీ చేసిండు అని మీరే ఒప్పుకున్నారు.. మేము 21000 కోట్లు చేసినం అని కూడా మీరే చెప్పుకున్నరు. మీకంటే కేసీఆర్‌ 8000 కోట్లు ఎక్కువ చేసినట్టే కదా !  మరి నిన్నేం మాట్లాడినావు ? అది నోరా ? మోరా ? రేవంత్ రెడ్డి. రైతుబందులో. . .ఇప్పుడు తీసుకుంటే 10,000 Dec 9 నాడు నేను రాగానే తీసుకుంటే 15000 అన్నదేవడు ? ఇచ్చినావ 15000 చెప్పు రేవంత్ రెడ్డి.
 
అదీ మేము డబ్బులు రెడీ చేసి 2 రోజుల్లో ఇస్తామని మా హరీష్ రావు పాలకుర్తి సభలో చెప్పగానే ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసి మేమివ్వబోయే రైతు బంధు ను ఆపి… నువ్వు రాగానే అవే డబ్బులతో పాత 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నదెవరు? తర్వాత వానాకాలం పంటకు ఎగ్గొట్టి, తర్వాత యాసంగి పంటకు సంక్రాంతి కి ఇస్తానన్నదెవరు ?ఇచ్చినావ రేవంత్ రెడ్డి ?  తర్వాత మాట మార్చి  జనవరి 26 న టిక్…టిక్ అన్నదెవరు? వినిపించిందా టిక్ టిక్ ? ఇప్పుడు మళ్లీ 31 అంటున్నదెవరు ?ఇది మాట తప్పుడు కాదా ? అనడుగుతున్న రేవంత్ రెడ్డిని.’ అని వేముల ప్రశాంత్‌ రెడ్డి విరుచుకుపడ్డారు.

Bandi Sanjay : పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్