నిజామబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ రైతు వేదిక వద్ద రైతులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆశ మాషగా రాలేదని తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న బాధలతో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని సీఎం కేసీఆర్ తనతో ఎన్నోమార్లు అన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
Also Read : TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఏ ఏ టికెట్లు విడుదలంటే..
తెలంగాణ రైతాంగం విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోవడం ఎంతో మంది రైతులు తమ ప్రాణాలను సైతం విడిచారని ఆనాటి రోజులు పాలకులు అలా గడిపారని నేటి కేసిఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ రైతులకు పంపుసెట్లకు సరిపడా విద్యుత్ను అందించడంతోపాటు తెలంగాణలో కాలేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల బాగానే సాగు భూములకు సాగునీరు అందించిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు.
Also Read : Saindhav: చిన్న పాప కోసం పోస్టరా? ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మైక్!
అనంతరం.. Ntvతో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలను ఖండించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. కష్టపడుతున్న మా లాంటి వాళ్లను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడని, ఎంపీకి కనీస అవగాహన లేదని ఆయన మండిపడ్డారు. డబుల్ బిల్ తీసుకున్న అని ఆరోపణ చేసిండని, సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ కింద కేంద్రం 3 వందల కోట్లు కేటాయించిందని, ఇందులో 70 కోట్లు బ్రిడ్జి నిర్మాణానికి కేటాయించామన్నారు. సీబీఐ విచారణ కాదు ఏ విచారణకైనా సిద్ధమేనని ఆయన సవాల్ విసిరారు.