Keralam: గవర్నర్‌ను కలిసిన సతీశన్.. 18న సీఎంగా ప్రమాణస్వీకారం
- 10 రోజుల తర్వాత వీడిన కేరళం సీఎం సందిగ్ధం
- ముఖ్యమంత్రిగా సతీశన్ ఎంపిక
- ఈనెల 18న సీఎంగా సతీశన్ ప్రమాణస్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి సందిగ్ధం వీడింది. గురువారం వీడీ.సతీశన్‌ను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. అనంతరం సీఎల్పీ లీడర్‌గా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. సాయంత్రం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను సతీశన్ కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరగా.. అందుకు గవర్నర్ ఆహ్వానించినట్లుగా లోక్‌భవన్ తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌కు బలం ఉండడంతో గవర్నర్ వెంటనే ఆమోదించినట్లుగా తెలుస్తోంది.
ఇక కేరళం రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రిగా సతీశన్ ఈనెల 18న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్‌ను పరీక్షించిన పాకిస్తాన్..
140 సభ్యులున్న కేరళం అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 63 స్థానాలు దక్కించుకోగా.. ముస్లిం లీగ్ 22 స్థానాలు, కేరళ కాంగ్రెస్ 8 స్థానాలు, విప్లవ సోషలిస్టు పార్టీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. తొలుత ముఖ్యమంత్రి రేసులో కేసీ.వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అనంతరం సతీశన్, రమేష్ చెన్నితాల పేర్లు తెరపైకి రావడంతో పార్టీలో వర్గపోరు మొదలైంది. చివరికి సతీశన్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కింది.
#WATCH | Thiruvananthapuram | Keralam CM designate VD Satheesan leaves from the Lok Bhavan after meeting Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar. pic.twitter.com/mcUxvwsXa3
— ANI (@ANI) May 14, 2026
తాజావార్తలు
-
Keralam: గవర్నర్‌ను కలిసిన సతీశన్.. 18న సీఎంగా ప్రమాణస్వీకారం
-
TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్‌కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!