కోనసీమ ప్రకృతి అందాలకు హరివిల్లు ఆహ్లాద కరమైన పచ్చ పచ్చని పైర్లు, ఆకు పచ్చని కొబ్బరి చెట్లు వాటి చుట్టూ కాలువలు, అక్కడక్కడ అందమైన గోదావరీ నదీ పారే సెలయేర్లు, దానికి మించి గోదారోళ్ల వినూత్న పెళ్లిళ్ల సందడి అంతా అంతా కాదని చెప్పాలి. పంజాబీ వేషధారణలో మేళ తాళాలుతో పెళ్లి కొడుకు జోడి గుర్రాల రథంలో రాజకుమారుడిలా ఊరేగుతుంటే మహారాష్ట్ర సంస్కృతిలో అమ్మాయిలు చీరలు కట్టి బుల్లెట్ల బండ్లపై పెళ్ళికొడుకు రథానికి ముందు ఆహ్వానం పలకడం పల్లె వాసులను ఆకట్టుకుంటుంది.
Rjy2
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మామిడికుదురు గ్రామంలో జరిగిన గోకవరపు వారి కల్యాణ వేడుకలో అవినాష్ వెడ్స్ లక్ష్మి పెళ్లి వేడుకలో ఈ వినూత్న ఊరేగింపు బాణాసంచాలు, పంజాబీ మేళాలు, తాళాలు. రాజులు కాలం నాటి జోడు గుర్రాల రథంపై పెళ్ళికొడుకు ఊరేగింపులు, బుల్లెట్ల బైకులపై మహారాష్ట్ర సంస్కృతిలో వస్త్రధారణ చేసి మహిళలు ఊరేగింపులు.పల్లెవాసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇలాంటి వివాహం ఈమధ్యకాలంలో చూడలేదంటున్నారు స్థానికులు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read Also: Minister Jagadish Reddy: గవర్నర్ పై మంత్రి జగదీశ్ ఫైర్