దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ (SSMB29) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు రూ.1300 కోట్ల భారీ వ్యయంతో, హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా, తెరకెక్కిస్తున్నా ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు దీటుగా ఉండే మరో పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్ ఉండబోతోందట. ఈ కీలక పాత్ర కోసం రాజమౌళి ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ పాత్రకు ఇచ్చే ఎలివేషన్లకు ఏమాత్రం తగ్గకుండా ఈ విలన్ క్యారెక్టరైజేషన్ ఉండబోతోందని, కథలో ఈ పాత్ర ఇచ్చే ‘షాక్’ సినిమాకే హైలైట్ అని ఫిలిం నగర్ టాక్.
Also Read : Malaika Arora: విడాకులు, బ్రేకప్స్‌పై షాకింగ్ నిజాలు బయటపెట్టిన మలైకా..!
విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను అందించగా, దేవా కట్టా ఈ చిత్రానికి మాటలు సమకూరుస్తున్నారు. కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను పూర్తిగా IMAX ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్‌తో దేశవ్యాప్తంగా భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో, రాజమౌళి తన మార్క్ మేకింగ్‌తో ఇండియన్ సినిమాను మరోసారి ప్రపంచస్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఆ పవర్‌ఫుల్ విలన్ ఎవరో తెలిసే అవకాశం ఉంది.