దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘వారణాసి’. ఈ సినిమా కోసం సినీ లోకమంతా కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేశాయి. అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇచ్చాడు జక్కన్న. ఇక తాజాగా ఈ గ్లింప్స్ పై సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు..
Also Read : Krithi Shetty : ఆ హీరోతో చాలా కంఫర్ట్‌గా ఉంటుంది..
టీజర్ చూసిన వెంటనే మహేశ్ బాబుకు ఫోన్ చేసి, చాలాసేపు ఆ ఎగ్జైట్‌మెంట్‌తో మాట్లాడానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.. ‘ఆ ఎద్దుపై ఎంట్రీ చూసి షాక్ అయ్యాను. వారణాసి గ్లింప్స్‌లోని ప్రతి ఫ్రేమ్ నన్ను షాక్‌కు గురి చేసింది. రాజమౌళి గారి క్రియేటివిటీ ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే, కానీ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మహేశ్ బాబు ఎద్దుపై వచ్చిన ఎంట్రీ సీన్ చూసి నాకైతే మాటలు రాలేదు. ప్రతి షాట్ ఒక టైమ్ ట్రావెలర్‌లా అనిపించింది. ఆయన నుంచి మరో అద్భుతం రాబోతోందని ఆ రోజే అర్థమైంది’ అంటూ అనిల్ రావిపూడి రాజమౌళి మార్క్ మేకింగ్ గురించి మాట్లాడాడు. ఇక ప్రజంట్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాను తీస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు అనిల్ తెలిపారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా 20 నిమిషాల పాటు ఉండే ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట. చిరు-వెంకీల మధ్య వచ్చే క్లైమాక్స్ సీన్లు థియేటర్ లో పూనకాలు తెప్పించడం ఖాయమని, ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అనిల్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి అటు రాజమౌళి సినిమాపై తనకున్న క్రేజ్‌ను పంచుకుంటూనే, ఇటు మెగాస్టార్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు అనిల్ రావిపూడి.