సికింద్రాబాద్Father Dance: కొడుకు పెళ్లిలో తండ్రి డ్యాన్స్.. మైకల్ జాక్సన్‌ను మరిపించేశాడుగా నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని రేపు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అయితే.. సంక్రాంతి పండగకు ఊరెళ్లి వారికి వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. రేపు ప్రారంభించనున్న ఈ సర్వీస్ దేశంలో ఎనిమిదో వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ ట్రైన్ సికింద్రాబాద్ మరియు విశాఖపట్నం మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఈ ప్రయాణంలో ప్రయాణీకులకు అన్ని తరగతులలో వాలుగా ఉండే సీట్లు మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో తిరిగే సీట్లు ఉంటాయి. 160kmph వేగంతో కదులుతున్న రైలు, దక్షిణ మధ్య రైల్వే (SCR) ద్వారా నిర్వహించబడుతున్న మొదటి సెమీ-హై-స్పీడ్ రైలు అవుతుంది. టిక్కెట్ బుకింగ్‌లను ఆన్‌లైన్‌లో లేదా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు.
Also Read : Father Dance: కొడుకు పెళ్లిలో తండ్రి డ్యాన్స్.. మైకల్ జాక్సన్‌ను మరిపించేశాడుగా
అయితే.. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు బుకింగ్స్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. పండుగకు ఊరెళ్లిన పట్నం వాసులకు తిరుగు ప్రయాణంలో వందే భారత్ ట్రైన్‌లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పండుగ రద్దీతో ఇప్పటికే బస్, రైల్వే స్టేషన్‌లు కిక్కిరిపోయాయి. అయితే.. వందే భారత్ రైలు ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. 7.55 గంటలకు రాజమండ్రి, 10.00 గంటలకు విజయవాడ, 11.00 గంటలకు ఖమ్మం, 12.05 గంటలకు వరంగల్ మీదుగా మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. అటు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.35 గంటలకు వరంగల్, 5.45 గంటలకు ఖమ్మం, రాత్రి 7.00 గంటలకు విజయవాడ, 8.58 గంటలకు రాజమండ్రి, 11.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఇందులో 16 కోచ్‌లు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్, చైర్ కారు అని రెండు తరగతులు ఉంటాయి. కూర్చొనే ప్రయాణం చేయాలి. పడుకునే వీలుండదు. దాదాపు అంతా పగటి పూట ప్రయాణమే కాబట్టి స్లీపర్ కోచ్‌లు ఏర్పాటు చేయలేదు.
Also Read : Crypto Currency : క్రిప్టో కరెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్బీఐ గవర్నర్