Father Dance: ప్రతి తండ్రికి తన పిల్లల పెళ్లి జీవితంలో ఓ పెద్ద పండుగలాంటిది. వారిని ఇన్నాళ్లు కష్టపడి పెంచి వారిని ఓ ఇంటి వారిని చేయడంతో వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించానని మురిసిపోయే సందర్భం అది. ఈ సమయంలో వారి ఆనందానికి అవధులు ఉండవు. ఈ క్రమంలో పెళ్లిని వైభవంగా చేయాలని ప్రతి తండ్రి తాపత్రయపడుతుంటాడు. తనకు అంత స్థోమత లేకున్నా అప్పు చేసైనా వేడుక ఘనంగా చేయాలని భావిస్తుంటాడు. అలాగే ఢిల్లీలో ఓ తండ్రి తన కొడుకు పెళ్లిలో ఆనందంలో వేసిన డ్యాన్స్ మూమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Crypto Currency : క్రిప్టో కరెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్బీఐ గవర్నర్
ఆ తండ్రి డ్యాన్స్ చేస్తుంటే పెళ్లికి హాజరైన వారంతా ఆశ్చర్యపోయి తిలకించడం వారి వంతయ్యింది. ఈ వీడియోను కొరియోగ్రాఫర్లు తమ ఇన్‌స్టాగ్రాం ఖాతా టుగెదర్ అండ్ ఫరెవర్ వెడ్డింగ్ కొరియోగ్రఫీలో షేర్ చేశారు.ఈ వీడియోను ఇప్పటి వరకూ పది లక్షల మందికి పైగా వీక్షించారు. వైరల్ వీడియోలో యే జవానీ హై దివానీ మూవీలోని బద్‌తమీజ్ దిల్ సాంగ్‌కు వరుడి తండ్రి క్రేజీ స్టెప్స్‌తో ఇరగదీశాడు. ఈ సాంగ్‌కు తాను వేసిన స్టెప్స్ ను నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరి తండ్రి ఇలా ఎంజాయ్ చేయాలనితాను కోరుకుంటున్నట్లు ఓ యూజర్ రాసుకొచ్చారు. అసలు ఈ పాట అర్ధం ఏంటో తనకు ఇవాళ తెలిసిందని..అంకుల్ డ్యాన్స్‌తో ఇరగదీశాడని మరో యూజర్ కామెంట్ చేశారు.