గుండెపోటుకు గురైన మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం పోసారు ఎస్సై మహేందర్ లాల్. ఈ ఘటన యాదాద్రి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వలిగొండ మండల కేంద్రంలో వాహనాలను తనిఖీలు చేస్తూ విధులు నిర్వహిస్తుండగా.. అదే దారి గుండా వెళ్తున్న వలిగొండ మండలం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే మహిళకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ వెంటనే అక్కడికి చేరుకొని ఆలస్యం చేయకుండ మహిళకు…