Varuntej: వాళ్ళిద్దరితో అయితే ఓకే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వచ్చిన రియల్ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్.’. అలాంటి సినిమా తెలుగులో ఇప్పట్లో మరొకటి తెరకెక్కుతుందో లేదో తెలియదు. అయితే సీనియర్ స్టార్ హీరోలు యంగ్ హీరోలతో కలిసి కొన్ని మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నారు. కానీ వాటిని ‘రియల్ మల్టీస్టారర్’ కేటగిరిలో వేయడానికి ట్రేడ్ వర్గాలు అంగీకరించడం లేదు. నిజానికి ఇప్పటికే హీరోగా రాణిస్తున్న విక్టరీ వెంకటేష్ యువ కథానాయకులు మహేష్ బాబు, రామ్, వరుణ్ తేజ్ వంటి వాళ్ళతో సినిమాలు చేశాడు. అందులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్ 2’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ వెంకటేష్‌తో నటించిన యంగ్ హీరోస్ అంతా ఆ తర్వాత జనరేషన్ కదా అని కొందరు అంటున్నారు.
వెంకటేష్‌తో ఇప్పుడు ‘ఎఫ్ 3’ మూవీ చేస్తున్న వరుణ్ తేజ్‌ను ‘మీ జనరేషన్ హీరోలతో ఎవరితో అయినా మల్టీస్టారర్ మూవీ చేయొచ్చు కదా’ అని ప్రశ్నించినప్పుడు ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. ‘ఎవరితో సినిమా చేయడానికైనా తాను సిద్ధమేనని, అయితే తన తరం హీరోలలో సాయితేజ్‌తో నటించడాన్ని తాను ఇష్టపడతానని, ‘బావా… బావా…’ అంటూ అతనితో ఎప్పుడూ సరదాగా ఉంటానని, అలానే హీరో నితిన్‌తోనూ తనకు చక్కని అనుబంధం ఉందని, వారిద్దరితో కలిసి నటించమంటే మరో ఆలోచన లేకుండా చేసేస్తాన’ని బదులిచ్చాడు. అలానే వరుణ్ తేజ్ పెదనాన్న చిరంజీవిని ‘డాడీ’ అని పిలుస్తుంటాడు. ‘మీ డాడీతో సినిమా ఎప్పుడు చేస్తారు?’ అని అడిగిన ప్రశ్నకు ‘పెదనాన్న ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన సినిమాలో చేయడానికి నేను రెడీ. ఆయన మూవీలో చేయడానికి పాత్ర గురించి కూడా ఆలోచించాల్సిన పనిలేదు’ అని చెప్పాడు. వరుణ్ తేజ్ నటించిన ‘గని’ ఈ శుక్రవారం విడుదల కాబోతుండగా, ‘ఎఫ్ 3’ మే 27న జనం ముందుకు వస్తోంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీయస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా మే నెలలో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. దీనికి నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
Also Read
- Polimera 3: 'పొలిమేర 3' నుంచి అదిరే అప్డేట్.. కీలక పాత్రలో బ్లాస్ట్ స్టార్ అర్జున్
- Varanasi: మహేష్ 'వారణాసి'కి కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్.. సెప్టెంబర్ నుంచి అసలు పని!
- NEET UG Protest: విద్యార్థులు అరచి గెలిచారు.. నీట్ ఉద్యమంపై టాలీవుడ్ అగ్రతారల గొంతు మూగబోయిందా ?
- Dhanush: 'రాయన్' అవార్డుపై ధనుష్ స్పందన.. 'మెయ్యళగన్' మంచి సినిమానే, కానీ నా బాధ వేరే!

Varuntej
తాజావార్తలు
-
Abhishek vs Samson: అభిషేక్‌కు ఓ రూల్.. సంజుకు మరో రూలా.. బీసీసీఐపై తెలుగు ప్లేయర్ ఫైర్!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
CAT 2026 Notification: IIMల్లో MBA చదవాలనుకునే వారికి అలర్ట్.. CAT 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
-
Polimera 3: ‘పొలిమేర 3’ నుంచి అదిరే అప్డేట్.. కీలక పాత్రలో బ్లాస్ట్ స్టార్ అర్జున్
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!