యూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. ఇటీవల సామూహిక అత్యాచారనికి గురైన 12 ఏళ్ల మైనర్ బాలిక మృతి చెందింది.. గౌర్ ప్రాంతంలో సోమవారం బాలిక కూరగాయలు కొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. మోను సాహ్ని, రాజన్ నిషాద్, కుందన్ సింగ్ అనే ముగ్గురు నిందితులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడం తో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించగా, సింగ్ ఇంటి సమీపంలో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉందని సాహ్ని వారికి సమాచారం ఇచ్చారు..
వెంటనే అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించారు.. సోమవారం నుంచి ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయింది.. నిందితుడు మోను సాహ్నికి బాలికతో పరిచయం ఉందనీ, బాలికను తనతో పాటు తీసుకెళ్లింది అతనేనని, అతనితో పాటు మరో ఇద్దరు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు.. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.. అత్యాచారం, హత్య అభియోగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను బీజేపీ సభ్యులు కాపాడుతున్నారని ఆరోపిస్తూ వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.. అంతేకాదు వారిని వెంటనే ఉరితియ్యాలని పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు..
ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో రాజకీయ ప్రతిస్పందనలు మొదలయ్యాయి. ఈ విషయంపై ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్ నాయకత్వం లోని బీజేపీ సర్కారు పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు… గత నెలలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. చిన్నారులను అపహారించి అత్యాచారం చేసిన ఘటన అందరిని కదిలించి వేసింది.. యూపీలో ఇలా బాలికల పై వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు..