ఉత్తర్ ప్రదేశ్ లోని భాటియా గ్రామ పంచాయతీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2500ల ఇటుకల బిల్లులో ఏకంగా రూ. 1.25 లక్షలు వేశారు. సర్పంచ్, కార్యదర్శి సంతకం చేసిన ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పరిపాలనలో కలకలం మొదలైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. భాటియా గ్రామంలో ఒక బిల్లులో 2500 ఇటుకల ధరను రూ.1.25 లక్షలుగా చూపించిన కేసు వెలుగులోకి వచ్చింది, ఇది ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను లేవనెత్తింది. ఈ విషయంపై మీడియాలో కథనాలు రావడంతో ప్రభుత్వంలో భయం పట్టుకుంది. ఇటుకకు ఐదు రూపాయల చొప్పున 2,500 ఇటుకల బిల్లును జారీ చేసింది. ఇటుక సరఫరాదారు చేతన్ ప్రసాద్ కుష్వాహా, దీని కింద మొత్తం చెల్లింపు రూ. 1,25,000 గా చూపించారు. కరెక్ట్ గా చూస్తే రూ. 12,500 మాత్రమే అవుతుంది. సర్పంచ్, కార్యదర్శి సంతకంతో కూడిన ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పంచాయతీలో జరిగిన ఈ కుంభకోణంపై స్థానిక ఇటుక వ్యాపారి లాలన్ మిశ్రా మాట్లాడుతూ.. జిల్లాలో ఇటుకల ధర ఇటుకకు రూ.4 నుండి రూ.10 వరకు ఉంటుందని అన్నారు. ఈ పరిస్థితిలో, రూ.1,25,000 చెల్లించడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు. ఈ సంఘటన తర్వాత, కలెక్టర్ డాక్టర్ కేదార్ సింగ్ సంఘటనా స్థలానికి SDMని పంపి, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. అవినీతి జరిగినట్లు రుజువైతే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. .. ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం కాకుండా చూస్తామని అన్నారు.