ఉత్తర్ ప్రదేశ్ లోని భాటియా గ్రామ పంచాయతీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2500ల ఇటుకల బిల్లులో ఏకంగా రూ. 1.25 లక్షలు వేశారు. సర్పంచ్, కార్యదర్శి సంతకం చేసిన ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పరిపాలనలో కలకలం మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భాటియా గ్రామంలో ఒక బిల్లులో 2500 ఇటుకల ధరను రూ.1.25 లక్షలుగా చూపించిన కేసు వెలుగులోకి వచ్చింది, ఇది ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను లేవనెత్తింది.…