Uttam Kumar Reddy : తడిసిన ధాన్యంపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం కూడా కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మద్దతు ధర ఇచ్చి కొంటామని, సీఎస్.. కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చామని, రైతులు ఆందోళన చెందోద్దని ఆయన పేర్కొన్నారు. నష్టం ప్రభుత్వం భరిస్తుందని, కొందరు మిల్లర్లు తరుగు తీస్తున్నారని, ఇది సరికాదు.. ఆపేయండని ఉత్తమ్ అన్నారు. చివరి గింజ వరకు కొంటామని, నారాయణ పూర్ డ్యామ్ నుండి నీటి విడుదలకు అంగీకారం చెప్పారని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ని నీళ్లు ఆడిగామని, 2.25 టీఎంసీ ఇవ్వడానికి అంగీకరించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాగు నీటి కోసం.. Ndsa ఇంకో వారం..పది రోజుల్లో ఫైనల్ రిపోర్ట్ ఇస్తారని, దాని ఆధారంగా పనులు చేస్తామన్నారు.
అంతేకాకుండా..’కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నష్టపోయిన రైతులను అదుకుంటాం. బీఆర్‌ఎస్.. బీజేపీ దోస్తీ బయట పడింది. 2018 ఎన్నికలో క్యూ లైన్ లో ఉన్న ఓటర్ల కి డబ్బులు వేశారు. కానీ ఇప్పుడు మాత్రం రైతు బంధు నిధులు ఆపేయండి అని ఈసీ చెప్పింది. మామిడి రైతుల విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్తా. మోడీ ఆధాని కి పోర్టులు ఇచ్చి ఏం వసూలు చేస్తున్నారు. అందరూ ఆయన లాగా వసూలు చేస్తున్నారు అనుకుంటున్నారు. మోడీ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. సీఎం పైనా..ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మోడీ. రాహుల్..ఖర్గే..ప్రియాంక గాంధీ లు తెలంగాణ కి వస్తున్నారు. కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుస్తుంది. బీజేపీ కి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. ప్రధాని తన హోదా ని మరిచి మాట్లాడుతున్నాడు. ఎన్నికల కమిషన్ కూడా సైలెంట్ గా ఉంది. కాంగ్రెస్ అధికారంలో కి వస్తే.. రిజెర్వేషన్ లలో 50 శాతం పరిధి ఎత్తేస్తాం. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తాం. గత ఏడాది ఇదే సమయానికి.. 13.77 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.. ఇప్పుడు 24. 85 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.. గతంలో కంటే ఈ సారి రెట్టింపు కొనుగోలు చేసాము.’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు.
Also Read
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
తాజావార్తలు
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..