Uttam Kumar Reddy : తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలను రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి శనివారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులపై కీలక విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేపు నాలుగు సంక్షేమ పథకాలు మండలంలోని ఒక గ్రామంలో మధ్యాహ్నం 1 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తామని, రేషన్ కార్డులు, ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
Pilli Subhash Chandra Bose: పొరపాటున కూడా పార్టీ మారను.. నేను వైసీపీలోనే ఉంటా
అంతేకాకుండా.. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఆయన ప్రకటించారు. గతంలో దరఖాస్తు ఇచ్చినా, సర్వేలో వివరాలు ఇచ్చినా… ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోక పోయినా ఇప్పుడు ప్రజాపాలన కేంద్రాల్లో ఇవ్వండని ఆయన తెలిపారు. బీపీఎల్ కుటుంబాలందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. గత పదేళ్ళుగా దొడ్డు బియ్యం ఇచ్చారని, మనిషికి ఆరు కిలోల సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇకపై బయట ఆహార పదార్థాలు కొనుక్కోవాల్సి ఉండదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్.
Sankranthiki Vasthunam: 11 రోజుల్లో 246 కోట్లు.. క్లాస్ సినిమాతో మాస్ సంభవం