Harish Shankar: ‘చిరంజీవికి పవన్ తమ్ముడు మాత్రమే కాదు.. కొడుకు కూడా’ : హరీశ్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Shankar: ఉగాది పర్వదినం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న హరీశ్ శంకర్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read
చిరంజీవి మురిసిపోయారు..
ట్రైలర్ చూసిన తర్వాత చిరంజీవి తనకు ఫోన్ చేసి సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడారని హరీశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చిరంజీవి గారు ట్రైలర్‌లోని ప్రతి షాట్‌ను మెచ్చుకున్నారు. పవన్ చాలా అందంగా ఉన్నారని ఆయన మురిసిపోతుంటే.. చిరంజీవికి పవన్ కేవలం తమ్ముడు మాత్రమే కాదు, ఒక కొడుకు కూడా అని నాకు అనిపించింది” అని హరీశ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, భవిష్యత్తులో చిరంజీవితో కలిసి ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’ వంటి మాస్ హిట్లను మించే సినిమా తీస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చాకే దేశం గురించి మాట్లాడుతున్నారని అనుకోవడం పొరపాటని, ‘ఖుషి’, ‘బద్రి’, ‘బాలు’ వంటి సినిమాల్లోని పాటల ద్వారా ఆయన ఎప్పుడో తన సామాజిక స్పృహను చాటుకున్నారని గుర్తు చేశారు. “శ్రీశ్రీ గారి పద్యానికి ప్యాంట్, షర్ట్ వేసి.. దానికి కాస్త ‘స్వాగ్’ అద్దితే ఆ రూపమే పవన్ కళ్యాణ్” అంటూ తనదైన శైలిలో అభివర్ణించారు. పవన్ సహజ నటన వెనుక ఎంతో కష్టం ఉంటుందని, చిన్న డైలాగ్ కోసం కూడా ఆయన పదే పదే రిహార్సల్స్ చేస్తారని అన్నారు. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా పవన్ అభిమానుల్లో కొత్త జోష్ నింపుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.
READ ALSO: Iran-Israel: ఇరాన్ సైన్యాధిపతి సోలేమానీ హతం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!