ప్రస్తుతం ప్రెగ్నెన్సీపై ప్రతి ఒక్కరికి అవగాహన పెరగుతుంది.గర్భం దాల్చిన మొదటి నెల నుంచే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ లు , పౌష్టికాహారం తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. దీని ద్వారా పిల్ల బిడ్డ దాదాపు సురక్షితంగా ఉంటున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పేద మహిళలకు బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. అయితే మహిళలు ఈజీ డెలివరీ కోసం ఈ మధ్య యోగ లాంటివి కూడా చేస్తున్నారు. దీని వల్ల బిడ్డ పుట్టే సమయంలో నొప్పి తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇక యోగ లాంటి వాటితో పాటు రోజుకు కనీసం పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే సుఖప్రసవం జరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. లోతైన ధ్యానం మనసుకు కొత్త శక్తిని ఇస్తుంది.
Also Read: Singam Again: మా సౌత్ ‘సింగం’ కూడా కలిస్తే పాన్ ఇండియా సంభవం గ్యారెంటీ
పురిటినొప్పిని భరించగలమా లేదా అనే భయం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పట్ల ఆందోళన, పాపా పుడుతుందా? బాబు పుడతాడా? ఎలా ఉంటారు? తరువాత వారిని ఎలా పెంచాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ కలుగుతూ ఉంటాయి. ఇలాంటి ఒత్తిళ్లన్నింటికీ ధ్యానం ద్వారా పరిష్కారం లభిస్తుంది. ధ్యానం వల్ల ఎండార్ఫిన్ల విడుదల పెరుగుతుంది. దీని వల్ల నొప్పిని తట్టుకునే శక్తి వస్తుంది. ఆ కారణం చేత ప్రసవం సులభంగా జరుగుతుంది. ధ్యానం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు దరిచేరావు. గర్బధారయ సమయంలో ఒత్తిడి కారణంగా అడ్రినలిన్, కార్టిసోల్ వంటి హార్మోన్ల విడుదల పెరుగుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. దీనిని ధ్యానం తగ్గిస్తుంది. ప్రసవానంతర డిప్రెషన్ చాలామందిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ధ్యానంతో ఈ అవరోధాన్ని కూడా అధిగమించవచ్చు. పిల్లలు పుట్టిన తరువాత వారికి పాలు ఇవ్వాలి. అయితే ధ్యానం చేసే వారిలో చనుబాలు సమృద్ధిగా ఉంటాయని అనేక పరిశోధనల్ల్లో వెల్లడైంది. కాబోయే తల్లులకు వివిధ రకాల ఆలోచనల వల్ల చిరాకు వస్తూ ఉంటుంది. నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ధ్యానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అందుకే గర్భిణీలు క్రమం తప్పకుండా రోజుకు 15 నిమిషాలు అయినా ధ్యానం చేయాలి.