Joe Biden : జో బైడెన్ నే ఇబ్బంది పెట్టిన గొడుగు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే అది పరిపాలన పరంగా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఆయన చేసే పొరపాట్లు, తడబాట్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి సంబంధించిన పలు వీడియోలో గతంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా జో బైడెన్ మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ నెటిజన్లు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Also Read : Asifabad: గేదెను కరిచిన కుక్క.. ఆసుపత్రి పాలైన 302 మంది
Also Read
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
జపాన్ లో జరుగుతున్న.. జీ 7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడకి వెళ్లారు. అయితే, ఆయన జపాన్‌లో లాండయ్యే సమయానికే ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుంది. యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి మెట్లు దిగుతూ చినుకులు పడుతున్న కారణంగా ఆయన చేతిలో ఉన్న గొడుగుని తెరిచేందుకు ప్రయత్నిస్తాడు.. కానీ అది ససేమిరా అన్నట్లు తెరుచుకోదు. చివరకు దాన్ని అలానే చేతిలో పట్టుకుని కిందకు దిగాడు. ఈలోగా అక్కడ ఉన్న జపాన్ ప్రతినిధులకు అభివాదం చేయడం.. అనంతరం ప్రతినిధులు ఒక్కొక్కరిగా తమను తాము బైడెన్‌కు పరిచయం చేసుకుంటున్నాట్లు మనం ఈ వీడియోలో చూడొచ్చు..
Also Read : Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో టర్నింగ్ పాయింట్.. కీలక నగరం రష్యా వశం..
ఈ క్రమంలో బైడెన్ వానలో తడుస్తూనే వారితో మాట్లాడుతుండటం మనం గమనించవచ్చు. ఇది చూసిన అమెరికా అధికారులు తమవద్ద ఉన్న గొడుగును పట్టే ప్రయత్నం చేస్తారు. అయితే బైడెన్ మరోసారి ప్రయత్నించడంతో చివరికి గొడుగు తెరుచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా రెండొంతుల మంది అమెరికన్లు తనకు రెండవసారి అవకాశం ఇచ్చేందుకు విముఖత చూపుతున్నట్లు నమ్ముతున్నట్లు పోల్స్ చెబుతున్నప్పటికీ బైడెన్ మాత్రం 2024లో తిరిగి ఎన్నిక కావాలనే ప్రణాళికలతో ముందుకు కదులుతున్నారు.
It took Biden almost a minute to figure out how to open his umbrella after landing in Japan in a torrential downpour pic.twitter.com/n1s2KJH9pZ
— RNC Research (@RNCResearch) May 18, 2023
- Tags
- Japan
- Joe Biden
- Umbrella
- USA
- viral video
తాజావార్తలు
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..