US: అమెరికా మరోసారి విదేశీ పౌరులకు బిగ్ వార్నింగ్ ఇచ్చింది. భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం అమెరికాలో ఉంటున్న విదేశీ పౌరులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. దాడి, గృహహింస, ఇతర తీవ్రైన నేరాల వంటి నేరాల్లో అరెస్టులు జరిగితే, తక్షణమే వీసా రద్దుకు దారితీయవచ్చని, భవిష్యత్తులో అమెరికాలోకి ప్రవేశించడానికి అర్హతను ప్రమాదంలో పడేస్తాయని స్పష్టం చేసింది. యూఎస్ వీసా ‘‘ఒక ప్రత్యేక సౌలభ్యం మాత్రమే అని హక్కు కాదు’’ అని స్పస్టం చేసింది. యూఎస్ గడ్డపై లేదా విదేశాల్లో చేసిన నేర కార్యకలాపాలకు తీవ్రమైన వలస శిక్షలకు దారితీస్తాయని చెప్పింది.
Read Also: Al Qaeda Module Busted: అల్ ఖైదా ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్..
విదేశీ పౌరులు చట్టాన్ని ఉల్లంఘిస్తే వీసా రద్దు చేయబడుతుందని భారత్ లోని యూఎస్ కార్యాలయం హెచ్చరించింది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేరాల నియంత్రణతో పాటు వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా, సరైన పేపర్స్ లేని విదేశీ పౌరులను యూఎస్ నుంచి బహిష్కరిస్తున్నారు. యూఎస్ చట్టాల ప్రకారం, దొంగతనం, దుకాణాల దొంగతనం, ఇతర ఆస్తి సంబంధిత నేరాల వంటి నేరాల తీవ్రమైన ఉల్లంఘనలుగా వర్గీకరించబడ్డాయి. చిన్న నేరాలుగా పిలువబడేవి కూడా వలసదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయి. వీసాల రద్దు, బహిష్కరణ, దేశంలోకి తిరిగి ప్రవేశించడంపై శాశ్వత నిషేధాలు ఉంటాయని యూఎస్ న్యాయశాఖ చెబుతోంది.